అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని గంగరాం ఆస్పత్రిలో చేరారు. భుజానికి జరిగిన శస్త్రచికిత్స కుట్లు తొలగించటానికి ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఐతే కొన్ని రోజులుగా సోనియా నీరసంగా ఉండటంతో మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ఆస్పత్రి వర్గాలు ఆమెకు సూచించాయి. మరో రెండు రోజుల పాటు సోనియా గాంధీ…ఆస్పత్రిలోనే ఉండనున్నారు. దాదాపు నెలరోజుల క్రితం యూపీలోని వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా సోనియా ఆస్వస్థతకు గురయ్యారు.
ఆస్పత్రిలో చేరిన సోనియా




