Tuesday, 3 November 2026

ఆహార భద్రత ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం


న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) :
ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు కనీసం ఆహార భద్రత కల్పించాలనే స్పృహ పాలకులకు ఇన్నాళ్లకు కలిగింది. పట్టెడన్నం కూడా దొరకక సంభవిస్తున్న ఆకలి చావుల నివారణకు ఒక్క అడుగు ముందుకు పడింది. ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఆమేరకు ఆర్డినెన్స్‌ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ విషయం కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్‌ వెల్లడించారు. ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం కోసం పంపుతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *