
ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన చిదంబరం
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) :
ప్రభుత్వరంగ బ్యాంకర్లు వడ్డీ రేటును తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం కోరారు. బుధవారం బ్యాంకర్లతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు కాస్త ఉదారంగా వ్యవహరించి వడ్డీరేట్లు తగ్గించుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంర్లు స్పందిస్తేనే రూపాయి బలోపేతమవుతుందని తెలిపారు. భారతీయ రిజర్వ్‌బ్యాంక్ రూపాయి బలోపేతానికి చర్యలు చేపట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో సీఆర్‌ఆర్ సవరణ, వడ్డీరేట్ల పెంపుపై బ్యాంకర్లు పట్టుబట్టడం సరికాదని అన్నారు.
వడ్డీరేటు తగ్గించుకోండి




