నిన్న ఎడముఖం.. నేడు కరచాలనం
మోడీ, షరీఫ్‌లు మాట్లాడుకున్నారు..
కఠ్మాండు, నవంబరు 27 (జనంసాక్షి) : ఆ ఇద్దరు ప్రధానమంత్రులు చేతులు కలిపారు. నిన్న ఎడముఖం పెడముఖంగా ఉన్న నేతలు గురువారం కరచాలనం చేశారు. మోడీ, నవాబ్‌షరీఫ్ మాట్లాడుకున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి నేపాల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు గురువారం ఎట్టకేలకు కరచాలనం చేసి పలకరించుకున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్ సమావేశాల రెండోరోజు వారిద్దరూ కరచాలనం చేసుకుని… బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర బహదూర్ పాండే ధ్రువీకరించారు. బుధవారం సాయంత్రం నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ఇచ్చిన విందులో పాల్గొన్న వీరు రిసెప్షన్ గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిపారు. కాగా ఈ సదస్సులో 26/11 ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నవాజ్ షరీఫ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్ ఇబ్బందులను పెంచినట్లు అయ్యింది. పరస్ఫర సహకారంతో కలిసి నడుస్తున్న పరి పుష్ట ప్రజాస్వామ్య దేశాల సమాహారం సార్క్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. 18వ సార్‌క శిఖ రాగ్ర సదస్సు నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సులో మోడీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం ఆద్యంతం విదేశంగ విధానంలో భారత్ పోషిస్తున్న పాత్రను చక్కగా సమావేశంలో చెప్పుకొచ్చారు. సార్‌క దేశాల మధ్య సహకారం పెరిగితే మరో వైపు చూడవలసిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ‘మేము భారత్ గురించి ఎ లాంటి కలలు కంటున్నామో సార్‌క కూడా అలా?గ ఉండాల న్నది మా ఆకాంక్ష’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘మన యువ త గుండెల నిండా విశ్వాసంతో ఉంది. యువతను సవ్య ది శలో నడిపించవలసి ఉందని ఆయన సూచించారు. ప ర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటే మనమే గొప్ప మార్కెట్ సృష్టించుకోవచ్చని ఆయన అన్నారు. సార్‌క దేశాల చిన్నా రులకు టిబి, హెచ్‌ఐవి వ్యాక్సిన్లు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ తెలియజేశారు. సార్‌క దేశాల నుంచి రోగులకు తక్షణమే వైద్య వీసాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని ప్రకటించారు. ‘మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, గొప్ప మార్కెట్ ఉంది. అయినా ప్రజలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు. ‘మన మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాలి. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. భారత్ అభివృద్ధితోనే దక్షిణాసియా అభివృద్ధి ముడిపడి ఉందన్న ఆయన సార్క్ దేశాలు ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, రోడ్లు, రైలు మార్గాలు అభి వృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. సార్‌క దేశాల కోసం ఆవిష్కరించిన ఉపగ్రహమే అందరి పట్ల తమకు ఉ న్న గౌరవానికి సూచిక అని మోడీ స్పష్టంచేశారు. కేవలం భారత్ కోసమే కాదు దక్షిణాసియా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. సురక్షితమైన, బలమైన దక్షిణాసియాను భారత్ కోరుకుంటోందని ఆయన తెలిపారు. సార్‌కలోని ప్రతి దేశం సగౌరవంగా ప్రపంచం ముం దు తలెత్తుకుని నిలవాలన్నదే తమ లక్ష్యమని మోడీ చెప్పారు. ఉగ్రవాదంపై సార్‌క సమష్టిగా పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు. దక్షిణాసియాలో శాంతికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టంచేశారు. ముంబైపై దాడి ఘటనకు బుధవారంతో ఆరేళ్లు పూర్తయినట్లు మోడీ సదస్సులో తెలిపారు. మంచి పొరుగు దేశం ఉండాలని ఏ దేశమైనా ఆశిస్తుందని సార్క్ సదస్సులో పాకిస్తాన్‌పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియాలో శాంతికి ఆఫ్ఘనిస్తాన్ కట్టుబడి ఉందని ఆదేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ స్పష్టంచేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ మాట్లాడుతూ, వివాదాలు లేని దక్షిణాసియాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె మాట్లాడుతూ, ఉగ్రవాదం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా సవాలుగా మారిందని అన్నారు.





