పలు మ్యాచ్‌లు రద్దు.. పలువురి సంతాపం
సిడ్నీ, నవంబరు 27 (జనంసాక్షి) : గాయపడిన ఆస్ట్రేలియా క్రికేటర్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈ రోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్టేల్రియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఫాస్ల్ బౌలర్ సీన్ అబాట్ బౌన్సర్ దూసుకువచ్చి తలకు తగలగా గాయపడిన హ్యూస్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మైదానంలో హ్యూస్ గాయపడినప్పటినుంచి ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచేవరకు అతని కుటుంబసభ్యులు వెన్నంటే ఉన్నారు. తాము శాయశక్తులా కృషి చేశామని, అయినా ఫలితం లేకపోయిందని హ్యూస్‌కు చికిత్స అందించిన వైద్యులు పేర్కొన్నారు. అతని కుటుంబసభ్యులకు వారు ప్రగాఢసానుభూతి తెలిపారు. హ్యూస్ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. కాగా సౌత్ ఆస్టేల్రియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యూస్ అప్పటికి 63 పరుగులు చేసి జోరువిూదున్నాడు. ఆ దశలో ఫాస్ల్ బౌలర్ సీమ్ అబాట్ వేసిన బౌన్సర్‌ను హుక్ చేయబోయాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మనైన హ్యూస్.. షాట్ ఆడే ప్రయత్నంలో తలను ఒకవైపు తిప్పాడు. వేగంగా దూసుకొచ్చిన బంతి హెల్మెట్ కింద ఎడమచెవి దగ్గర బలంగా తగిలింది. కొన్ని సెకన్లు అలా నిలబడ్డాక హ్యూస్ కుప్పకూలిపోయాడు. అప్పుడు కూడా తల పిచ్‌కు బలంగా తగలింది. వెంటనే హ్యూస్ దగ్గరికి వచ్చిన ఆటగాళ్లు ఆందోళనతో సహాయం కోసం సైగలు చేశారు. జట్టు వైద్య బృందం చాలా త్వరగా హ్యూస్‌ను చేరుకుని చికిత్స మొదలుపెట్టింది. అచేతనంగా ఉన్న హ్యూస్‌ను వాహనంతో ఉన్న /-టస్రెచర్‌పై పక్కకు తీసుకెళ్లారు. న్యూసౌత్‌వేల్స్ వైద్యుడు జాన్ ఆర్చర్డ్ అతడికి చికిత్స చేశాడు. ఆంబులెన్స్ వచ్చేంతవరకు హ్యూస్ నోట్లో నోరు పెట్టి వూదుతూ శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. ఆక్సిజన్ కూడా పెట్టారు. డేవిడ్ వార్నర్ అతడి వెంటే ఉన్నాడు. కొద్దిసేపట్లోనే మూడు ఆంబులెన్స్‌లు వచ్చాయి. వైద్యవసతులున్న హెలిక్టాపర్ కూడా ఎస్‌సీజీలో దిగింది. హ్యూస్ తిరిగి వూపిరితీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు కనిపించింది. వెంటనే అతణ్ని ఆంబులెన్స్‌లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించారు. మధాహ్నం 2.23కు హ్యూస్‌కు గాయం కాగా.. 3.05కు ఆంబులెన్స్ ఆసుపత్రికి బయల్దేరింది. ఆటను రద్దు చేశారు. హ్యూస్‌కు శస్త్రచికిత్స నిర్వహించినట్లు, అత్యవసర విభాగంలో అతడి పరి/-థసితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి సాయంత్రం 5.20కి ధ్రువీకరించింది.
హ్యూస్ మృతితో పలు మ్యాచ్‌లు పాక్షికంగా రద్దు!
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో పలు మ్యాచ్ లు పాక్షికంగా రద్దయ్యాయి. శుక్రవారం నుంచి ఆస్టేల్రియా ఎలెవన్ తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజును రద్దువేస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ స్సష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ను ఒక రోజుపాటు రద్దుచేస్తున్నట్లు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్, డైరెక్టర్ రవిశాస్త్రిలు ఆటగాళ్లకు తెలిపారు. దీంతో రేపు ఆరంభం కావాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాస్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దుచేశారు.షెడ్యూల్ ప్రకారం పాక్-కివీస్ ల మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ఇరు బోర్డుల అంగీకారంతో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మ్యాచ్ ను రద్దు చేశారు.
అడిలైడ్‌లో జరగాల్సిన రెండ్రోజుల భారత్ మ్యాచ్ రద్దు
భారత్- ఆస్టేల్రియాకు ఎలెవెన్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరగాల్సిన రెండ్రోజుల మ్యాచ్ రద్దు చేశారు. ఆస్టేల్రియాకు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి నేపథ్యంలో సన్నాహక మ్యాచ్‌ను అధికారులు రద్దుచేశారు.
‘మానని గాయాలు’
ఆటలన్నాక గాయలు సహజం.. కానీ ప్రాణాలు తీసేంత గాయలు అరుదు క్రికెట్ లో గాయాలు కావడం సర్వసాధారణమే అయినా.. కొన్నిసందర్భాల్లో క్రికెటర్లు మృత్యువుతో సాహసం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ క్రికెటర్లను ‘గాయాలు’ బాధిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ను అప్పుడప్పుడూ మరణాలు షాక్ కు గురి చేస్తుంటాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో మృత్యువుతో రెండు రోజులు పోరాడి అసువులు బాసాడు. గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరి కొందరు క్రికెట్ తీవ్ర గాయాలతో ఆట నుంచి వైదొలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1959 లో అబ్దుల్ అజీజ్.. 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ బాల్ తన ఛాతికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయాడు. చివరకు ఆస్పత్రిలో మరణించాడు.1960లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు తగలడంతో ఆరు రోజులు కోమాలు ఉన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.1975 లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్ కు ఇంగ్లండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. అనంతరం అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.1986లో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ మైకేల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర గాయమయ్యింది.భారత ఆటగాడు రమణ్ లాంబా షార్ట్ ్గ/న్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు.
పాత హెల్మెట్ వల్లే ప్రమాదం
పాత హెల్మెట్ ప్రాణం విూదకు తెచ్చింది. ఆటలు ఆడేప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం తప్పనిసరి. ఆస్టేల్రియా క్రికెటర్ హ్యూస్ పాత మోడల్ హెల్మెట్ ధరించడం వల్లే అతడు తీవ్రంగా గాయపడటానికి కారణమని హెల్మెట్ తయారీ దారులు చెబుతున్నారు. యునైటెడ్ కింగ్ డమ్కు చెందిన హెల్మెట్ తయారీ సంస్థ ప్రతినిథి మసూర్ విూడియాతో మాట్లాడుతూ హ్యూస్ ..షెఫిల్డ్ షీల్డ్ మ్యాచ్లో ధరించిన హెల్మెట్ లేటెస్ట్ మోడల్ది కాదన్నారు. హ్యూస్ ధరించిన హెల్మెట్ గత ఏడాది విడుదలైన మోడల్ అని వివరించారు. లేటెస్ట్ మోడల్లో తలకు పూర్తి రక్షణ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు మనూర్ చెప్పారు.
హ్యూస్ మరణంపై ట్విట్టర్‌లో పలువురు క్రికెటర్ల సంతాపం
ఆస్టేల్రియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణంపై పలువురు క్రికెటర్లు దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇది క్రికెట్ ప్రపంచంలో అత్యంత దుర్దినమని పేర్కొన్నారు. హ్యూస్ మరణంపై సంతాపం తెలుపుతూ పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో సందేశాలు పోస్టు చేశారు. పోస్టు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా,రోహిత్ శర్మ, ఆడం గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్ తదితరులు ఉన్నారు. వీరంతా హ్యూస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.





