– ఏప్రిల్ కల్లా ఇంటింటికి మంచి నీరు
– సీఎం కేసీఆర్
మెదక్,జనవరి11(జనంసాక్షి): వచ్చే ఖరీఫ్ నుంచి విత్తన భాండాగారంగా ఎర్రవల్లి,నరసన్నపేట గ్రామాలను తీర్చిదిద్దుతామని సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎర్రవల్లి, నర్సన్నపేటలో 3వేల ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగు చేస్తామన్నారు. ప్రతి రైతుకు బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తామన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలోని చెరువుల అభివృద్ధికి రూ.6కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అభివృద్ధిలో రెండు గ్రామాలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. వచ్చే ఖరీఫ్ నుంచి గ్రామాలను విత్తన భాండాగారాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఏప్రిల్ 30 నాటికి ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాపర్యటనలో భాగంగా ఎర్రవెల్లిలో రూ. 28.80 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో వంద శాతం సబ్సిడీతో రూ. 42.54 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేటకు రెండు రోజుల్లో త్రీ ఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రెండు రోజుల్లో రెండు గ్రామాలకు 3ఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో పర్యటించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎర్రవల్లి, నర్సన్నపేటలో 3 వేల ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగు చేస్తామన్నారు. ప్రతి రైతుకు బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తామని చెప్పారు. ఈ రెండు గ్రామాల్లోని చెరువుల అభివృద్ధికి రూ. 6 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అభివృద్ధిలో రెండు గ్రామాలు ఆదర్శంగా నిలవాలి. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు శిక్షణ ఇచ్చే పాఠశాలలుగా ఎదగాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఏప్రిల్ 30 నాటికి ప్రతి ఇంటా గోదావరి జలాలు సరఫరా చేస్తామని కేసీఆర్ తెలిపారు.
మిషన్ భగీరథతలో ఎప్రిల్ 30 కల్లా ఇంటింటా మంచినీరు
ఆడబిడ్డ బిందెపట్టుకుని బజార్లో కనిపిస్తే ఆ ఊరు సర్పంచ్ రాజీనామా చేయాల్సిందేనని సిఎం కెసిఆర్ అన్నారు. ఎప్రిల్ నాటికి ఊరూరా మంచినీటిని అందించే పని చేపట్టామని, ఆ తరవాత ఏ ఊళ్లో కూడా మహిళలు నీటి కోసం బయటకు రాకూడదన్నారు. దుబ్బాకలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సిఎం కెసిఆర్ ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడ్డట్టే అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దుబ్బాకలో ఉన్నత పాఠశాల నూతన భవనానికి, రామసముద్రం చెరువు సుందరీకరణ, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో బాలాజీ ఫంక్షన్ హాలులో సీఎం సవిూక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనం చేసే పని ఎక్కడో ఉండదు.. మన చుట్టే ఉందని, అందుకే ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. దుబ్బాక విూద తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తాను ఇక్కడ చదువు కోవడం వల్లనయితేనేవిూ, ఎమ్మెల్యే రామలింగారెడ్డి విూద ఉన్న అభిమానం విూద అయితేనేం దీని అభివృద్దికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తెలంగాణకు నిధుల కొరత లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికా విభాగం కింద 46 వేలకోట్లు కేటాయిస్తే ఇప్పుడు తెలంగాణలో దాదాపు 62వేల కోట్లు ప్రణాళికా పద్దుల కింద ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఇదంతా కూడా ప్రత్యేక రాష్ట్రంలో మన నిధులుమనం ఖర్చుపెట్టుకునే అవకాశం వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇక్కడ చదువుకున్నందున ఇక్కడి మట్టి, గాలిలో పెరిగినందున ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తానని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీకి రూ. 25 లక్షలు కేటాయిస్తున్నాం. అద్భుతంగా పని చేసిన గ్రామానికి అదనంగా మరో రూ. 25 లక్షలు ఇస్తాం. ప్రజాస్వామ్య దేశంలో ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం. ప్రతి గ్రామానికి వైకుంఠధామం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూమి కొనైనా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేవించారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డంప్‌యార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. ఏప్రిల్ 30 నాటికి ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరఫరా చేస్తాం. గ్రామాల్లో ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందె పట్టుకుని బజార్లో కనబడితే ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలని అన్నారు. సమైక్య రాష్ట్రంలో మన చెరువులన్నీ ధ్వంసమయ్యాయి. చెరువులు ఊరికి బతుకుదెరువులు అని చెప్పారు. వాటిని పునరుద్దరించేందుకే మిషన్ కాకతీయ ప్రారంభించామని అన్నారు. చెరువులు ఊరికి బతుకుదెరువు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మన చెరువులన్నీ ధ్వంసమయ్యాయి. 4 సంవత్సరాలలో చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు. 2 సంవత్సరాల తర్వాత దుబ్బాక నియోజకవర్గానికి బ్రహ్మాండమైన సాగునీరు వస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరు ఇస్తాం. మా రాష్ట్రం మాకొస్తే.. మా వనరులు మేమే ఖర్చు చేసుకుంటామని ఆనాడే చెప్పాను. ఇక పేదలకు డబుల్ బెడ్రూమ్స్ కట్టించి ఇస్తున్నాం. గ్రామ
ప్రజలే ముందుండి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇకపోతేదుబ్బాకకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. దుబ్బాకలో హైస్కూల్, జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు. దుబ్బాకకు వందపడకల ఆస్పత్రి మంజూరుకు హావిూఇచ్చారు. దుబ్బాక డిపోకు కొత్త బస్సులు, దుబ్బాకకు ఫైర్ స్టేషన్ మంజూరు, దుబ్బాక నియోజకవర్గంలో 10 వేల మంది మహిళలకు దీపం పథకం కింద కొత్త కనెక్షన్లు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక దుబ్బాక నియోజకవర్గానికి అవసరమైనన్ని కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేస్తాం. నియోజకవర్గంలో షాదీఖానా ఏర్పాటు చేస్తాం. రూ. 5 కోట్లతో టౌన్‌హాల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటన్నిటిని సక్రమంగా వినియోగించుకోవడంలో గ్రామస్థులు ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి,మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ రాస్, ప్రత్యేకాధికారి స్మితాసబర్వాల్ తదితరుల పాల్గొన్నారు. అనంతరం తనతో పాటు చిన్ననాడు కలసి చదువుకున్న మిత్రులను సిఎం కలుసుకున్నారు. వారితో అలనాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. ఈ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని అన్నారు. నిధుల కొరత లేదని అన్నారు. కోరుకున్నట్లుగా తెలంగాణ వచ్చిందని, అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. అందుకు అంతా కలసి పాటుపడాలన్నారు. తనకు ఇక్కడ సాహిత్యంలో బీజం పడిదంన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను చూస్తూ ఊరుకోలేకనే ఉద్యమంలో దిగాననన్నారు.





