రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్దేనని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నయనే.. రైతులను రెచ్చొట్టేలా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 23వేల 556 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఉప ఎన్నిక కోసం రైతులను రెచ్చగొట్టవద్దని.. ఎన్నికలు వస్తుంటయ్, పోతుంటయన్నరు. ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో ప్రతిపక్షాలు అనవరసర రాద్ధాంతం చేస్తున్నయని.. ఎక్కువ నీటిని వాడుకోవాలనదే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వినోద్ స్పష్టం చేశారు.
ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే




