బంగారు తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ సర్కారు దూసుకుపోతున్నది. ప్రజలకు నాణ్యమైన పాలన అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నది. ముఖ్యంగా కనీస సౌకర్యాలు కల్పించే శాఖలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నది. దీనిలో భాగంగా వాటర్ వర్క్స్ విభాగంలో ఉద్యోగుల కొరత ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా టీఎస్ పీఎస్సీకి సూచించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ వర్క్స్ లో 300 మంది మేనేజర్లు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 154 మందితో సంస్థను నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంకా 146 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇక జలమండలిలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే సమాచారంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నరు. అదేవిధంగా ఎఫ్ అండ్ ఏ విభాగంలో 120 మంది అవసరం ఉండగా.. కేవలం ఐదుగురు మాత్రమే అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇంకా 115 అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అటు మరో రెండు డీజీఎం ఉద్యోగాలను సైతం భర్తీ చేయనున్నారు.
జలమండలిలో మేనేజర్ ఉద్యోగానికి సివిల్, ఐటీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సీఎస్‌సీ లో బీటెక్ చదివిన వారు అర్హులు. ఇక అసిస్టెంట్ ఉద్యోగానికి బీ.కామ్ కంప్యూటర్స్ కోర్సు చదివిన వారు అర్హులని అధికారులు తెలిపారు




