Monday, 2 November 2026

ఆ మోడల్ కు మూడేళ్లు జైలు

ప్రముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌ధుర్ భండార్క‌ర్‌ పై హ‌త్యాయ‌త్నం కేసులో మోడ‌ల్ ప్రీతి జైన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది సెష‌న్స్ కోర్టు. 2004లో మ‌ధుర్ త‌న‌పై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు దాఖలైంది. ఆ కేసును 2012లో కొట్టేసింది సుప్రీంకోర్టు. 2005 సెప్టెంబ‌ర్‌లో మధర్ ను హతమర్చాలని గ్యాంగ్‌స్ట‌ర్ అరుణ్ గాలీ అనుచ‌రుడు న‌రేశ్ ప‌ర్దేశీతో డీల్ చేసుకున్నట్లు ప్రీతిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  అయితే ప్రీతి రూ.75 వేల డబ్బు ఇచ్చినా.. ప‌ర్దేశీ ప్లాన్ మిస్ అవ్వడంతో త‌న డ‌బ్బు తిరిగివ్వాల‌ని ప్రీతి డిమాండ్ చేసింది. చాకచక్యంగా వ్యవహరించిన గ్యాంగ్‌స్ట‌ర్ అనుచ‌రులు ఈ విషయాన్ని పోలీసుల‌కు తెలియజేయగా..2005 సెప్టెంబ‌ర్ లో కేసు న‌మోదు చేసి.. ప్రీతిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *