ఇంకెన్నాళ్ళు

ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగింది.ఆర్‌.నారయణమూర్తి తీసిన వీర తెల ంగాణ,శంకర్‌ కలలప్రాజెక్ట్‌ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృ ష్టమో అందులో ఆంధ్రాహీరో అయిన కూడా చూసినం బాగానే నడి చింది.అవార్డులు తెచ్చింది.ఆ తరువాత రసమై బాలకృష్ణ తీసిన జై తెలంగాణ పడుతూ లేస్తూనే ఉంది.మళ్లీ మన మధ్యలో కరీంనగర్‌ ముస్లిం బిడ్డరఫీ తీసిన ‘ఇంకెన్నాళ్లు’ సినిమా పుట్టకముందే బిడ్డని చంపినట్టుంది.తన సర్వస్వం వడ్డి,దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చుపెట్టి,ఇప్పటి వరకు ఉన్న సినిమాలో లేని విషయాలను,ఈ పోరుగడ్డపై పుట్టిన పౌరుషంతోని ఆలోచనలతోని, ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల సాక్షిగా తెలంగాణలో ఏమి జరుగుతుం దో చూపిస్తే అది ప్రదర్శించడానికి వెయ్యినొక్క కష్టాలు.సాదారణంగా ఏ కళాకారు డికైనా తన కళనుచూసి అభిమానిస్తేనాలుగు మంచి మాటలు చెపితే లోటుపాట్లను చూపిస్తే పడ్డకష్టం అంతాపోతుంది.కాని రఫీకి ఎదురైనా చేదుఅనుభవాలు అన్నిఇన్ని కావు,మనవాళ్ల దగ్గరనుండి బయటవాళ్లదాక యువకుడు అందులో ఇంతెత్తున తెలంగాణ ఉద్యమం లేచి పడుతుంటే ఇంకా నా సినిమాకు అడ్డుఎవడు అనుకున్నాడు.కాని సినిమా తీసేటపుడు అది ఎట్ల ఉండాలో ఎవరిని ఒప్పించాలో సినిమా మొత్తం అయిపోయి నంక కాని తెలవలేదు.అసలు రఫీతో మాట్లాడినంక కాని అర్థంకా లేదు,ఇన్ని రోజులు తెలంగాణ సినిమాలు,కళాకారులు ఎందుకు వెనుకబడ్డారు,కళ ఎక్కడ కల తప్పింది,ఇక్కడ ఉన్న జనపదాలు ఎందుకు బోందపెట్టబడినాయి,మిద్దెరాములు అంతటివాడు,చిందు ఎల్లమ్మ గొప్ప కళాకారిణి ఆఖరి రోజులలో కానికాస్త గుర్తింపు ఎందుకు తెచ్చుకోలేదు అర్థంకాలేదు.పాపం గోపు లింగారెడ్డి టేపురికార్డు పట్టుకుని తెలంగాణపల్లె పల్లె తిరిగిరికార్డ్‌చేయకపోతే సగంజానపదాలు బయటప్రపంచానికి తెలిసేవికావు.ఇప్పటితరం వారికి మనం ఇచ్చింది కేవలం ఆంధ్రా,రాయలసీమ ఐటంపాటలు, డబల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు కక్షలు,కుట్రలు,కుతంత్రాలు,స్త్రీలను బూతుబొమ్మలుగా చూపించి ఇవ్వడం మనంపెద్దగా చేసేది ఏమిలేదు.కూడా. ఎందుకు మనకీగతి?అపుడెపుడొ అదుర్స్‌ సినిమా ని బెదిరిస్తేఆదరలేదా ఆంధ్రానిర్మాతలు?ఆ తరువాత పర్యవసనాలు ఇపుడు మాటలాడడం అంతమంచిదికాదుకాని,అప్పటినుంచి అసలు ఆంధ్రాసినిమాలని ఎందుకు మనం అడ్డుకోవడంలేదు?ఇక్కడ దుకా ణలు పెట్టుకొని,పుట్నాలకు,బటానీలకు భూములను కొనుక్కొని, పచ్చళ్లతోని వచ్చిస్టూడియోలు పెట్టుకొని వ్యాపారాలు నడిపిస్తున్న వారినిమనం ఎప్పుడన్నఎమన్న అన్నమా?నిన్నటివరకు కాదు ఇప్ప టికి కూడా తెలంగాణభాషను మాట్లాడే పరిస్థితి ఆంధ్రాఆఫీసుల్లో, సినిమాలలొ లేదు,అంతోఇంతో ఉద్యోగులలో,అక్కడక్కడా ఆఫీ˜ిసు లలో మాట్లాడుతున్నారు.ఇదేమి ఉద్యమం?ఒక్కమాటచేపితే గడగ డలాడించే నాయకత్వం లేకపోతే ఇంక ఏ మొహంపెట్టుకొని మనం మాట్లాడతాము?మనం ఏమన్నా అన్యాయం మాట్లాడుతన్నామా? మొన్నటికి మొన్నస్టూడియోఎన్‌లో ఒక్కసారేఇంకెన్నాళ్లుఈ మధ్యకా లం లో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగిం ది.ఆర్‌.నారయణమూర్తి తీసిన వీర తెలంగాణ,శంకర్‌ కలలప్రాజెక్ట్‌ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృష్టమో అందులో ఆంధ్రాహీరో అయిన కూడా చూసినం బాగానే నడిచింది.అవార్డులు తెచ్చింది.ఆ తరువాత రసమై బాలకృష్ణ తీసిన జై తెలంగాణ పడుతూ లేస్తూనే ఉంది.మళ్లీ మనమధ్యలో కరీంనగర్‌ ముస్లిం బిడ్డరఫీ తీసిన ‘ఇంకెన్నాళ్లు’ సినిమా పుట్టకముందే బిడ్డని చంపినట్టుంది.తన సర్వస్వం వడ్డి,దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చుపెట్టి,ఇప్పటి వరకు ఉన్న సినిమాలో లేని విషయాలను,ఈ పోరుగడ్డపై పుట్టిన పౌరుషంతోని ఆలోచనలతోని, ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల సాక్షిగా తెలంగాణలో ఏమి జరుగుతుందో చూపిస్తే అది ప్రదర్శించడానికి వెయ్యినొక్క కష్టాలు. సాధారణంగా ఏ కళాకారుడికైనా తన కళ నుచూసి అభిమానిస్తే నాలుగు మంచి మాటలు చెపితే లోటుపాట్లను చూపిస్తే పడ్డకష్టం అంతాపోతుంది. కానీ, రఫీకి ఎదురైనా చేదుఅ నుభవాలు అన్నీ ఇన్నీ కావు, మనవాళ్ల దగ్గర నుండి బయటవాళ్లదాకా యువకుడు అందులో ఇంతెత్తున తెలంగాణ ఉద్యమం లేచి పడుతుంటే ఇంకా నా సినిమాకు అడ్డెవడు అనుకున్నాడు. కానీ, సినిమా తీసేటపుడు అది ఎట్ల ఉండాలో ఎవరిని ఒప్పించాలో సినిమా మొత్తం అయిపోయినంక కాని తెలవలేదు. అసలు రఫీతో మాట్లాడినంక కాని అర్థం కాలేదు, ఇన్ని రోజులు తెలంగాణ సినిమాలు, కళాకారులు ఎందుకు వెనుకబడ్డారు, కళ ఎక్కడ కల తప్పింది, ఇక్కడ ఉన్న జనపదాలు ఎందుకు బొందపెట్టబడి నాయి, మిద్దె రాములు అంతటివాడు, చిందు ఎల్లమ్మ గొప్ప కళాకారిణి ఆఖరి రోజుల్లో కానీకాస్తా గుర్తింపు ఎందుకు తెచ్చుకోలేదో అర్థం కాలేదు. పాపం గోపు లింగారెడ్డి టేపు రికార్డు పట్టుకుని తెలంగాణలో పల్లె పల్లె తిరిగి రికార్డ్‌ చేయకపోతే సగం జానపదాలు బయట ప్రపంచానికి తెలిసేవి కావు. ఇప్పటితరం వారికి మనం ఇచ్చింది కేవలం ఆంధ్రా, రాయలసీమ ఐటం పాటలు, డబల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, స్త్రీలను బూతుబొమ్మలుగా చూపించి ఇవ్వడం మనం పెద్దగా చేసేది ఏమిలేదు కూడా. ఎందుకు మనకీ గతి? అపుడెపుడో అదుర్స్‌ సినిమాని బెదిరిస్తే అదరలేదా ఆంధ్రా నిర్మాతలు? ఆ తరువాత పర్యవసానాలు ఇపుడు మాటలాడడం అంతమం చిదికాదు కాని, అప్పటి నుంచి అసలు ఆంధ్రా సినిమాలని ఎందుకు మనం అడ్డుకోవడంలేదు? ఇక్కడ దుకాణాలు పెట్టుకొని, పుట్నాలకు, బటానీలకు భూములను కొనుక్కొని, పచ్చళ్లతోని వచ్చి స్టూడియోలు పెట్టుకొని వ్యాపారాలు నడిపిస్తున్న వారిని మనం ఎప్పుడన్న ఏమన్న అన్నమా? నిన్నటి వరకు కాదు ఇప్పటికి కూడా తెలంగాణ భాషను మాట్లాడే పరిస్థితి ఆంధ్రా ఆఫీసుల్లో, సినిమాలలో లేదు, అంతో ఇంతో ఉద్యోగుల్లో, అక్కడక్కడా ఆఫీసులలో మాట్లాడుతు న్నారు. ఇదేమి ఉద్యమం? ఒక్కమాట చెపితే గడగడలాడించే నాయకత్వం లేకపోతే ఇంకా ఏ మొహం పెట్టుకొని మనం మాట్లాడతాము? మనం ఏమన్నా అన్యాయం మాట్లాడుతన్నామా? మొన్నటికి మొన్న స్టూడియోఎన్‌లో ఒక్కసారే అందరిని తీసివేస్తే ఏమి చేసినం అన్యాయం చూస్తూ ఊరుకోవడం అన్యాయమే కాదా ? తెలంగాణ అంటే ఒక్క ఎన్నికలు మాత్రమే ఒకళ్ళని ఒకళ్ళు తిటుకోవడమేనా రఫీ తీసిన సినిమాలో ఇక్కడి నాయకత్వానికి వారి ఆమరణ దీక్షకి పెద్ద పీట వేయలేదని ఆ పార్టీ వాళ్ళు మొఖం పట్టుకొని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే తెలంగాణ సినిమాలు, పాటలు అన్నీ కూడా ఒక పార్టీకి భజన సంగాలుగా మారాల్నా అపుడు వేరే హీరోలను వెతక్కోవడం ఎందుకు అన్ని సినాములలో ఒక్కడి హీరోని పెట్టుకుంటాం కదా ఆంధ్రా తెలంగాణ మధ్య అగ్గి పుడుతుంటే, సాధారణ ప్రజలు మానసికంగా వేరై బతుకులు ఎల్లదీస్తుంటే, భూములను పోగొట్టుకొని, ఉద్యోగాలు లేక పట్టుకోని బోత్తుంటే గుండెలు రగుల్తలేవా వలసలు ఆపలేని వాళ్ళు శవాలను తిరిగి పంపించడి అని పోట్టాట ఎందుకు వాటికి కూడా ఎన్నికలు గిలిచే దాకా అగాలనాఅవును వ్యాపార సంస్కృతిలో కథలు రాయలేము. వ్యాపార దృష్టితో సినిమాలు తీయలేము.

అదే మన బలహీనత కావచ్చు కాని గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా ఒక మైనార్టీ యువకుడు పోరాటాల చరిత్ర కలిగిన హుస్నాబాద్‌ ముద్దుబిడ్డ, ఆత్మహత్యలకి గుండె చెరువైతనకున్న కళనంత రంగరించి తాసిన ఒక కళా రూపాన్ని మనం కనీసం చూడడానికి వసతులు కల్పించుకోలేక పోవడం దౌర్భాగ్యం కాదా ? ఉద్యమం అంటే పైసల్‌ సంపాదించడం సారా బిర్యాని అని ఆంధ్రోళ్లు జోకులేస్తున్న ఈ రోజుల్లో కోటి రూపాయల దాకా పెట్టుబడి పెట్టి నాకు డబ్బులు వద్దు నా సినిమాని నా తెలంగాణ ప్రజలకి చూపించండి అని ప్రతి ఒక్క గుమ్మం తట్టిన రఫీ మనకి కనపడేది ? ఏంది ఆక్రోశం అసమానత, అచేతనం, తెలంగాణ బయటోల్ల తోని మోస పోతలేదు, ఇంటోల్లె పెద్ద దొంగలని ఎర్రబడ్డ మొహంతో ఆవేశంగా మాట్లాడుతున్న రఫ ీమొహమే ఇంకి కళ్లలోంచి చెరిగి పోతలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క జిల్లాలో కనపడ్డ మిత్రుల తోని నాయకులతోని విద్యార్థుతోని అలుపెరగకుండి తన కష్టాలని చెప్పకుంటూ, కన్నీళ్ళని దిగమింగుకుంటూ పట్టుదలతో ముందుకు పోదామని ఆశిస్తున్న రఫికి ఏం సమాధానం చెపుదాం. ఇందులో మన బాధ్యత లేదా ? రఫి హీరో, గాయకుడు, రచయిత, దర్శకుడు, అన్నింటి కన్నా గొప్పగా కష్టాలకి స్పందిచే గునమున్నోడు ఇంతకన్నా ఏమ్కావాలే శవాల మీద ప్రమాణాలు చేసి పైసలు ఏరుకొని శవాలపై పార్టీలను నిర్మించుకుని దశాబ్ధాలుగా తెలంగాణని బంగారు బాతుగుడ్డు లెక్క వాడుకుంటున్న వాళ్లు రఫీ ముందు ఏ పాటి ఇదే నిర్వేదంతోనే రఫీ లాంటి కళాకారులు మనసు చెదిరి, కలలు కూలిపోయి, కలాలు మొరాయించి ఏమి చేయలేక తనలోని కళాకారుడిని చంపుంటే కానీ మనకు మనశ్శాంతి దొరకదా పాపం ! ఆయన సినిమాలు ఆడనియ్యట్లేదు కాబట్టి మనం చాటుగా ఉద్యోగాలకి, విద్యార్ధులకి చూపిద్ధాం అని కొందరు మిత్రుల సలహా. ఉచిత సలహా అంటే ఇదేనేమో ! అసలు ఒక చిన్న ప్రశ్న ఏ చిన్న పిల్లవాడు కూడా అడిగేది, ఒక సినిమాని ఆడనియ్యలేని మనం తెలంగాణ తెస్తాం అని ఎట్లా అనుకుంటున్నాం? ఇస్తం అనేటోల్లు దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. నాయకత్వాన్ని ఏమీ అనొద్దు, నీకు చేతనైతే నువ్వు ఏమైనా చెయ్యి అనేటోళ్లకి కూడా ఒక మనవి, ఉద్యమాలు నాయకులని బట్టే ఉంటాయని చరిత్ర చెపుతుంది. నిన్నటికి నిన్న తొమ్మిది విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న పెద్ద మనుషులు కలిసి ఇదే చెప్పడం జరిగింది.

అపుడు మేమంతా ఒక్క తాటిపై ఉండడానికి గల కారణం మాకు ఒక నాయకుడు ఉండడం, మేము అతనిని పూర్తిగా నమ్మి ప్రాణాలు అర్పించే దాకా పోయినం అని అపుడు అంత పటిష్టంగా జరిగింది. అంటే అపుడు రాజకీయ పార్టీల చేతిలో లేదు, ఎపుడైతే రాజకీయ పార్టీల చేతిలో పోయిందో అపుడే మోసం పోయినం అని ఇప్పటికి ఉద్యమము నాయకత్వం గురించి ఏమి మాట్లాడొద్దు కాని తెలంగాణకి మొత్తం కేర్‌ ఆఫ్‌ అడ్రసు మాత్రం ఒక్కటే, నాయకుడు లేదు అన్నప్పుడు ఇంక ముచ్చేటేందుకు? ఈ రెండు దిక్కులా మాట్లేడే వాళ్ళు ఏమ్చేస్తారో తెలవదు కాని, ప్రజల అల్లాడుతుంటే మాత్రంనప్పుడు చేయరు. సరే ఇపుడు మన ముందు ఉన్న భాద్యత రఫీలాంటి వాళ్ళని కాపాడుకొని ఇంకెన్నాళ్లు ఈ అన్యాయం అని ప్రశ్నించాలి. ఆంధ్రా సినిమాలను బందు చేయాలి, తెలంగాణ సినిమాలను ఆడనీయకపోతే మీ ఆంధ్రా సినిమాలను కూడా ఆడనీయం అని చెప్పాలె, ఇది కూడా చేయలేకపోతే మేము నాయకులం కాదు అని బోర్డు తిప్పుకోవాలే ఇది న్యాయబద్ధమైన డిమాండ్‌ లేదా, ఒక పేపర్‌, టీవీ పెట్టుకున్నోల్లం ఒక సినిమా హాలు కూడా కట్టుకుంటే పోతుంది, మన దేశంలో మనమే కాందిశీకులం. అయ్యా పెద్ద పెద్ద జాగాలున్నోల్లు, బంగ్లాలు ఉన్నోళ్లు ఎవరైన ఈ సినిమాలు కొరకు కేటాయించండి. శత్రువును ఎదుర్కోవడం చాతకాకపోతే కనీసం మనం ప్రత్నాయం వెతుక్కోవాలి ఇది చాతగానితనానికి నిదర్శనమే అయినా అన్నిటికీ చేడినోల్లం ఇందులో ఎందుకు వెనుక బడడం.. లేవండి తెలంగాణ కళాకారులని బతకనియ్యండి. ఇంకెన్నాళ్లు అని మరోసారి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకరాకండి..

సుజాత సూరెపల్లి