Monday, 2 November 2026

ఇంజనీర్లను కొడతారా: హరీశ్

harish-0907పాల‌మూరులో చీఫ్ ఇంజ‌నీర్ ఖగేందర్‌రావు సహా ముగ్గురు ఇంజినీర్లపై జరిగిన దాడిని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఇంజినీర్లపై దాడి సహించరానిదన్నారు. దాడి చేసిన బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీ, మహబూబ్‌నగర్‌ ఎస్పీని కోరారు హ‌రీశ్. ఇంజినీర్లకు అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు హరీష్‌రావు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని భీమా ప్రాజెక్టు ప‌రిశీల‌న‌లో భాగంగా ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తున్న ప్రాజెక్టు అధికారులపై ప్రోటోకాల్ పాటించ‌లేదంటూ స్థానిక జెడ్పీటీసీ స‌భ్యులు మూడు రోజుల క్రితం దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇటు పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఇవాళ రివ్యూ చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి  కలెక్టరేట్ లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పనులు స్పీడ్ గా చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *