ఇంటర్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఖమ్మం: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుంటా సాయికుమార్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సమాజంలో తాను బతకలేనని నిర్ణయించుకొని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన చావుకు ఎవరు కారణం కాదని ఆ నోట్లో పేర్కొన్నాడు. సాయికుమార్ ఆత్మహత్యతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని… పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.