మణిపూర్, డిసెంబర్, 21 (జనంసాక్షి) : ఇంఫాల్‌లోని ఓ మార్కెట్ సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలింది. బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు పేలుడు ఘటన వేర్పాటు వాదుల పనేనని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
ఇంఫాల్‌లో బాంబు పేలుడు-ముగ్గురు మృతి,పలువురికి గాయాలు





