సభ్యత్వ నమోదుపై టీపీసీసీ చీఫ్ పొన్నాల
త
హైదరాబాద్, డిసెంబర్, 21 (జనంసాక్షి) : తెలంగాణ పార్టీ సభ్వత్వ నమోదు ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రామచంద్ర కుంతియాతో కలిసి పార్టీ నేతలతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుకల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. కాగా మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిపించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సభ్యుల వివరాలతో కూడిన పుస్తకాన్ని కుంతియాకు అందజేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. అంతే కాక పార్టీ బలోపేతానికి సోనియానే తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని విస్త్రుతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.





