Tuesday, 3 November 2026

ఇక ఆత్మహత్య నేరం కాదు

5

ఐపీసీ 309రద్దుకు కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ డిసెంబర్‌10 (జనంసాక్షి): ఐపీసీ సెక్షన్‌ 309ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈ అంశాన్ని పార్లమెంట్‌ కు పంపి ఆమోదం పొందనుంది. ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఈ సెక్షన్‌ ను తొలగించనున్నట్లు తెలిపింది. ఈ సెక్షన్‌ ను తొలిగించే అంశానికి 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు మద్దతు తెలిపాయని పేర్కొంది.ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించి బతికి బయటపడితే వారిపై పోలీసులు కేసు నమోదు చేసేవారు. సెక్షన్‌ 309 ప్రకారం నిందితులకు ఏడాది జైలు, జరిమానా ఉండేది. 1996 సంవత్సరంలో సెక్షన్‌ 309 రాజ్యంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 309 సెక్షన్‌ను తొలగించాలని గతంలోనే కేంద్రానికి లా కమిషన్‌ చూచించింది. సెక్షన్‌ 309 తొలగింపు అంశానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఆత్మహత్యాయత్నం నేరం కాబోదు. పోలీసులు కేసు నమోదు చేయలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *