న్యూఢిల్లీ, నవంబర్ 28 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆదేశ ప్రభుత్వ సహకారంతో గాలిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఇరాక్ దేశంలో చిక్కుకొన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకొంటోందని శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. దీనిపై బీఎస్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ… ఇరాక్‌లో చిక్కుకున్న 39మంది సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు. బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. గత 5నెలల నుంచి ఈ అంశం వార్తల్లో ఉందని, ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల కుటుంబాలను ఐదుసార్లు కలిసినట్లు వెల్లడించారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులు ఎక్కడ ఉన్నారో తెలియలేదని వివరించారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అధికారులు విచారణ జరపుతున్నారని, వారు హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవని స్పష్టంచేశారు.
ఇరాక్‌లో మనవాళ్ల కోసం గాలిస్తున్నాం : సుష్మాస్వరాజ్





