Monday, 2 November 2026

రాంపాల్‌ అరెస్టుకు రూ.26కోట్ల ఖర్చు

4http://JanamSakshi.org/imgs/2014/11/47.gif

హర్యానా, నవంబర్‌ 28 (జనంసాక్షి) : అక్షరాల రూపాయలు 26.61 కోట్లు.. ఇది వివాదాస్పద బాబా రాంపాల్‌ అరెస్ట్‌కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం. రాష్ట్ర పభుత్వం ఈ మేరకు శుక్రవారం పంజాబ్‌ హర్యానా హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. రాంపాల్‌ అరెస్ట్‌ నిమిత్తం హర్యానా రూ.15.43 కోట్లు,  పంజాబ్‌ రూ.4.34 కోట్లు, ఛండీగఢ్‌ యంత్రాంగం రూ.2.29 కోట్లు, కేంద్రం రూ.3.55 కోట్లు ఖర్చు పెట్టాయి. వెరసి ఈ అరెస్ట్‌ ఆపరేషన్‌కు రూ.26.61 కోట్లు ఖర్చుపెట్టడం గమనార్హం.కాగా రాంపాల్‌ అరెస్ట్‌ సందర్భంగా గాయపడినవారి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం హర్యానా డీజీపీ ఎస్‌.ఎన్‌.వశిస్ట్‌ను ఆదేశించింది. రాంపాల్‌ను అరెస్టు చేయడం కష్టమని, చాలా ఖర్చవడంతో పాటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని పోలీసులు కోర్టుకు చెప్పారు. అయితే, ఎంత ఖర్చయినా అరెస్టు చేయాల్సిందేనని, ఆ ఖర్చంతటినీ రాంపాల్‌ నుంచే రాబట్టాలని కూడా కోర్టు పోలీసులకు తెలిపింది. దాంతో ఇప్పుడు మొత్తం రూ. 26.61 కోట్ల మొత్తాన్ని రాంపాల్‌ నుంచి వసూలు చేసే అవకాశం ంది.మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరు పరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *