ఇళ్ల కోసం సిపిఎం పాదయాత్ర

శ్రీకాకుళం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతూ నగరంలో సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకూ సిపిఎం పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. దళితులు నివసిస్తున్న లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా వాటిని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 25 న నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బారావు, జిల్లా సిపిఎం కార్యదర్శి బవిరి కృష్ణ మూర్తి, తిరుపతి రావు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు