ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆందోళన
విజయనగరం,జూలై2(జనం సాక్షి ): నిరుదపేదలకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందిన సిపిఎం దుయ్యబట్టింది. పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను పెద్దలకు కటట్బెడుతున్నారని మండిపడింది. విజయనగరం పట్టణంలోని బాబా మెట్ట డబుల్ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పేదలు నివాసముంటున్న సుమారుగా రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు కాదని పెత్తందార్లుకు అప్పగించడంపై పేదలు, సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు, పేదలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని తక్షణమే ఆక్రమించిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు.