డప్పు కళాకారులను కాంగ్రెస్‌ విస్మరించింది: నక్కా

గుంటూరు,జూలై2(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో డప్పు కళాకారుల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వసంతరాయపురం క్యాంపు కార్యాలయంలో మంత్రి నక్కా ఆనందబాబును డప్పు కళాకారులు సోమవారం కలుసుకున్నారు. డప్పు కళాకారులకు నెలకు 1,500 రూపాయలు పెంక్షన్‌ మంజూరు చేసినందుకు నక్కాకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డప్పు కళాకారుల సంక్షేమానికి చిత్త శుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్‌ రాష్ట్ర అధ్యక్షులు మురికిపుడి దేవపాల్‌, మాదిగ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు పెద్దిపోగు కోటేశ్వరరావు, మాల మహానాడు జాతీయ యువజన సంఘ అధ్యక్షులు గోళ్ళ అరుణ్‌ కుమార్‌, మెడిద బాబురావు, పిల్లి మేరీ, మాణిక్యరావు, సౌపటి రత్నం, అడపా మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.