ఇసుక రీచ్‌లతో అడుగంటనున్న భూగర్భ జలాలు
ఆందోళనలో స్థానిక ప్రజలు
కడప,మే24(జనం సాక్షి): ఇష్టానుసారంగా ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగుంటిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు ఎండలు భగ భగ మండుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయి. అనేక గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నా కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్య తీరలేదు. నీటి పథకాలకు ముప్పు వాటిల్లకుండా ఇసుకరీచ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. చెయ్యేరు నదిపరీవాహక ప్రాంతంలో మూడు రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. /ూజంపేట మండలంలోని బాలరాచప్లలె, నందలూరు మండలంలోని టంగుటూరు, పెనగలూరు మండలంలోని కోమంతరాజుపురంలో వీటిని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే కోణంలో పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి అనధికారికంగా ఇసుకను అడపదడపా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెయ్యేరులో మరో మూడురీచ్‌లు వస్తే ఇసుకాసురులకు ఆదాయం సమకూరినా భూగర్భ జలాలకు ముప్పుతప్పదని అంటున్నారు. ఇక్కడ లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి ఇసుక వైపు మొగ్గు చూపుతారు. చెయ్యేరు నదిపై అన్నమయ్య జలాశయం నిర్మించడం వల్ల ఎడారిగా మారిపోయింది. గతంలో వచ్చిన వరదలకు డ్యాం నుంచి లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఫలితంగా ఇసుక మేటలు భారీగా వేశాయి. ప్రస్తుతం ఎడారిగా మారిపోవడంతో ఇసుకాసురులకు కలిసివచ్చింది. నది తీరం వెంబడి ఎక్కడపడితే అక్కడ తోడేస్తున్నారు.ఇక్కడి నుంచి ఇసుక రవాణా ఉచితంగా చేసుకోవచ్చునని టీడీపీ సర్కారు ఆదేశించింది. ఈ క్వారీలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుకను భారీగా తరలించేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో భూగర్భ జలాలు అడుగంటుతాయన్న ఆందోళన నెలకొంది. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అనేక కాలనీల్లో వందలాది కుటుంబాలు తాగునీరు లేక విలవిలలాడుతున్నాయి.