ఢిల్లీ డిసెంబర్ 31 (జనంసాక్షి) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇంఛార్జి చైర్మన్‌గా శైలేశ్ నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శైలేశ్ నాయక్‌ను ఇంఛార్జి చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. బరోదా ఎంఎస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన
నాయక్ గతంలో 2000 సంవత్సరం వరకు ఇస్రోలో పనిచేశారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఓషియన్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. గతంలో ఈ పదవికి ఎంఎస్ ప్రసాద్, కిరణ్‌కుమార్‌ల పేర్లు వినిపించినా నాయక్‌ను పదవి వరించింది.
ఇస్రో ఛైర్మన్‌గా శైలేశ్ నాయక్




