– 224 మంది మృతి
– 150 మంది మృతదేహాల గుర్తింపు
– కొనసాగుతున్న సహాయక చర్యలు
న్యూఢిల్లీ,అక్టోబర్31(జనంసాక్షి): మరో ఘోర విమానప్రమాదం చోటుచేసుకుంది. ఈజిప్టులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 224 మంది ప్రయాణికులతోపాటు ఏడుగురు సిబ్బంది దుర్మరణం చెందారు. రష్యాకు చెందిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానం (ఎయిర్ బస్ ఏ-321) సినాయి ద్వీపకల్పం విూదుగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా గల్లంతైంది. ఈజిప్టులోని సినాయ్‌లో కూలిన రష్యన్ ఎయిర్ బస్- 321 రెండు ముక్కలైందని ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనాస్థలంలో ఇప్పటివరకు 150మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన ఎయిర్‌బస్ – 321 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్య సినాయ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 224 మంది ఉన్నారు. ఈ ఘటనపై మొదట గందరగోళం నెలకొంది. అయితే విమానం కూలిపోవటం వాస్తవమేనని, ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించామని ఈజిప్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ప్రయాణికులలో 90 శాతం మంది రష్యా పర్యాటకులే కావటం గమనార్హం. సినాయి ద్వీపకల్పంపై ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల పట్టుండటంతో వారుగానీ ఈ ఘాతుకానికి పాల్పడిఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈజిప్టు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. ఎర్రసముద్ర తీరంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది. బయలుదేరిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ పరిధికి అందకుండాపోయింది. విమానం సైప్రస్ విూదుగా ప్రయాణించి గల్లంతైనట్లు మొదట భావించారు. అంతలోనే సినాయిలోని ¬సన్నా ప్రాంతంలో విమాన శకలాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్లామ్.. విమానం కూలిపోయినట్లు ప్రకటించారు. సహాయకబృందాలను రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు. ప్రయాణికుల్లో అత్యధికులు మరణించి ఉంటారని ఈజిప్టు అధికారులు నిర్ధారించారు. విమానంలో 217 మంది ప్రయాణికుకుల్లో 17 మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు రష్యా అధికారగణం
పేర్కొంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది రష్యాకు చెందిన టూరిస్టులే కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవార్త తెలిసన వెంటనే దాదాపు 40 అంబులెన్స్ లు ప్రమాద స్థలికి చేరుకున్నాయని స్థానిక విూడియా తెలిపింది. విమానం ఎందుకు కూలిందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. పీటర్స్ బర్గ్ లోని పుల్కోవ్ ఎయిర్ పోర్టులో హెల్స్ లైన్ ను ఏర్పాటుచేసి, ప్రయాణికుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నారు.
పుతిన్ తీవ్ర దిగ్భాంతి
రష్యా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఈజిప్టులో కూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. రష్యా సహాయబృందాలు వెంటనే ఈజిప్టుకు బయలుదేరాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన ఎయిర్‌బస్ 321 విమానం టేకాఫ్ అయిన 23 నిమిషాల్లోపే సినాయ్‌లో కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఈజిప్టు అధికారులు విమాన శకలాలను గుర్తించారు. ప్రమాదస్థలంలో భద్రత దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్యా లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది అలక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగల్మావియా ఎయిర్లైన్స్పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. కాగా, ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 100 మృతదేహాలను వెలికి తీసినట్లు ఈజిప్ట్ సహాయక బృందాలు పేర్కొన్నాయి. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి.బ్లాక్‌బాక్స్ లభ్యం కావడంతో విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం లభ్యమయ్యే అవాకాశం. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కోసం కూడా సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బ్లాక్‌బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడిస్తాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా పైలెట్ చివరిసారిగి ఏటీసీతో మాట్లాడాడు.





