Monday, 2 November 2026

పేదల పింఛన్లు ఆపొద్దు సీఎం కేసీఆర్‌ సమీక్ష

2

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) : పేద ప్రజలకు పింఛన్లు ఎట్టిపరిస్థితుల్లో ఆపొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పేదలకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించదని, డబ్బులకు వెనకాడదని అన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని అర్థంచేసుకొని అర్హులైన పేదలందరికీ జనవరి 1 నుంచి పెన్షన్లు, పెంచిన కోటా ప్రకారం బియ్యం అందించాలని ఆదేశించారు. సచివాలంయలో సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పెన్షన్లు పంపిణీ, ఆహార భద్రతా కార్డుల జారీ, వాటర్‌గ్రిడ్‌, చెరువుల పునరుద్ధరణ, తెలంగాణకు హరితహారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, రహదారులు తదితర అంశాలపై సమీక్షించారు. గతంలో 200 ఉన్న పెన్షన్‌ను ఐదింతలు పెంచి 1000 రూపాయలు చేశామని, దీనివల్ల ఎంతోమంది పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పెన్షనర్లను ఎంపిక చేసే విషయంలో ఆలస్యం చేయడం వల్ల అనవసరం ఆందోళన పెరిగిపోతుందని సీఎం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరినీ పేదవారిగానే గుర్తిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పించన్ల ఇస్తామని చెప్పాం, కాబట్టి ఖచ్చితంగా ఇస్తామని తెలియజేశారు. దీనిపై ఎలాంటి అపోహలు అక్కర్లేదన్నారు. మెత్తం  రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 25 లక్షల 68 వేల 392 మంది లబ్ధిదారుల మెదటి జాబితాను వెంటనే విడుదలచేయాలని  కలెక్టర్లను అదేశించారు. జాబితా విడుదల తర్వతా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే ఖచ్చింతగా పించన్లు ఇస్తామని మంత్రి తెలియజేశారు. మెదటి జాబితాలో ఉన్న లబ్దిదారుల జాబితాను గ్రామ పంచాయితీ వారీగా వేంటనే ప్రకటించాలని కలెక్టర్లను అదేశించారు. లబ్దిదారులకి పించన్ల పంపీణీ మెత్తం ఈనెల 10వ తేది నుండి 15 తేదిలోపల పూర్తవుతుందని తెలిపారు. పించన్ల పంపీణీ గ్రామ పంచాయితీల వారీగానే చెప్పట్టాలని కలెక్టర్లకి అదేశించారు. లబ్దిదారులకి అక్టోబర్‌, నవంబర్‌ తాలుకు రెండు నెలల పించన్లను ఒకేసారి ఇస్తామని తెలియజేశారు. ఇందుకు అవసరమైనా నిదులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమం-అభివృద్ధి రెండింటిని ముందుకు తీసుకెళ్తామని దాదాపు మూడు గంటలపాటు జిల్లా కలెక్టర్లతో సవిూక్ష నిర్వహించిన మంత్రి వారీ నుంచి జిల్లాల్లో ఉన్న పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు. దరాఖాస్తుల దృవీకరణ పూర్తయిందని తెలిపిన కలెక్టర్లు, పించన్ల లబ్దిదారుల ఏంపిక సైతం దాదాపుగా పూర్తయిందని ముఖ్యమంత్రి ప్రతి ఒక్క అర్హూనికి పించన్లు అందిస్తామని పదే పదే చెప్తున్నప్పుడు, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏంతైనా అర్ధిక భారాన్ని మోసేందుకు సిధ్దంగా ఉన్నప్పుడు, అధికారులెవ్వరు తమకు తాము పరిమితులు విధించుకోవల్సిన అవసరంలేదని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి, సాచ్యూరేషన్‌ పద్దతిన పించన్లు ఇస్తామని మంత్రి తెలియజేశారు.  పించన్లపై  ప్రభుత్వం ఏలాంటి సీలింగ్‌ విధించలేదని కలెక్టర్లకి గుర్తుచేశారు. కేవలం సాంకేతిక పరమైన ఇబ్బందులు, పరిమితుల పేరుతో ప్రజలకి ఇబ్బంది కలిగించ వద్దని కలెక్టర్లను కోరారు. సాంకేతిపరమైన అంశాల కన్నా ప్రజల సౌకర్యమై తమకి ముఖ్యమని కలెక్టర్లకి తెల్చిచేప్పారు. ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు తాము సిధ్దంగా ఉన్నామని, అందుకే కలెక్టర్లరు దృవీకరించిన ప్రతి ఓక్కరికి పించన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే అనర్హులైన వారు లబ్దిదారులు కాకుండా జాగ్రత పడాలని సూచించారు. గ్రామాల వారీగా పించన్ల పంపీణీ కార్యక్రామాన్నిచెపట్టాలని, ప్రజాప్రతినిధులు వారికి నచ్చిన  చోటకి వారే స్వయంగా వస్తారని మంత్రి కె. తారకరామా రావు తెలిపారు. పించన్ల పంపీణీలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లకి అదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వృద్ద కళాకారులకి పించన్లు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాలని తెలిపారు. వీరితోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న చెంచు లాంటి అదిమ తెగల జీవన ప్రమాణాల దృష్ట్యా 50 సంవత్సరాలకే పించన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. కలెక్టర్ల సవిూక్షా సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌, సెర్ఫ్‌ సియివో మురళితోపాటు ఇతర. ఉన్నతాధికారుల పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *