Tuesday, 3 November 2026

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

1

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి):

తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు ప్రకటించారు.హైదరాబాద్‌, వరంగల్‌, ఎన్టీఆర్‌ వర్శిటీలో కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో జేఎన్‌టీయూ సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఆర్మీ, ఎన్‌సీసీ అభ్యర్థులకు వచ్చేనెల 4,5 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో 2,550 మెడికల్‌, వెయ్యి బీడీఎస్‌ సీట్ల అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సమావేశం జరుగుతుందని.. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వెల్లడిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *