ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

ugjjebzd

న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టును ఓపెనర్ రహానే (47) ఆదుకున్నాడు. కానీ శాంసన్ (11), స్మిత్ (10), కరుణ్ అయ్యర్ (20), బిన్ని (1) విఫలం చెందారు. అనంతరం వచ్చిన హుడా మెరుపు వేగంతో ఆడాడు. కేవలం 25 బంతులను ఎదుర్కొన్న హుడా 54 పరుగులు చేసి తాహీర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఢిల్లీ జట్టుకు విజయం సాధించడానికి కావాల్సిన పరుగులను మోరీస్ (13 నాటౌట్), సౌతీ (7 నాటౌట్) చేశారు. ఏడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 186 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ లో తాహీర్ నాలుగు మిశ్రా రెండు, మాథ్యూస్ ఒక వికెట్ తీశారు. రాజస్థాన్ జట్టులో మోరీస్ రెండు, తంబే ఒక వికెట్ తీశారు.