
రాజ్బర్హీ నుంచి ఫరీద్పూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును ఫ్లాట్ ఫాంపై నిలిపిన డ్రైవర్.. ఇంజన్ను ఆన్ లోనే ఉంచి కాఫీ తాగేందుకు బయటికి వెళ్లాడు. గార్డు కూడా వేరే పనికోసం రైలు దిగాడు. ఆటోపైలట్ మోడ్ లోకి వెళ్లిన ఇంజన్ వెనుకగా ప్రయాణించడం ప్రారంభించింది. అలా రెండు మూడు ప్రమాదకరమైన మలుపుల తరువాత 26 కిలోమీటర్ల దూరంలోని పంగ్సా స్టేషన్లో.. అదికూడా టికెట్ కలెక్టర్ సమయస్ఫూర్తితో రైలు ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
‘రైలు అలా వెనక్కి వెళ్లడంతో ప్రయాణికులతోపాటు నేనూ కంగారు పడ్డాను. డ్రైవర్, గార్డుని సంప్రదించేందుకు ప్రయత్నించా. కానీ సిగ్నల్ దొరకలేదు. అప్పటికిగానీ నాకు అర్థం కాలేదు.. వాళ్లిద్దరూ ట్రైన్లో లేరని! ప్రయాణికుల సహాయంతో డ్రైవర్ క్యాబిన్ లోకి ప్రవేశించి కీ బాక్స్ను ఓపెన్ చేశా.. బోగీలను కలిపిఉంచే వాక్యూమ్ పైప్ లన విడగొట్టా. దీంతో మూడు బోగీలు విడిపోయాయి. బరువు తగ్గడంతో కొద్దిసేపటికి మిగిలిన బోగీలు కూడా ఆగిపోయాయి’ అంటూ తన సఫలయత్నాతన్ని వివరించాడు టీసీ అన్వర్ హుస్సేన్. విధినిర్వహణలో అలసత్వం వహించిన డ్రైవర్, గార్డును సస్సెండ్ చేయడంతోపాటు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.




