అత్యద్భుతంగా హరితహారం నిర్వహణ, పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి సీఎం కేసీఆర్ అవార్డులు అందజేశారు. హరితహారం విషయంలో.. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఉత్తమ కలెక్టర్ గా హరితమిత్ర అవార్డును అందుకున్నారు. అటు నిజామాబాద్ జిల్లా గిద్ద గ్రామం జడ్పీహెచ్ స్కూల్ ప్రిన్సిపల్, మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మెన్ కెవి రమణాచారి కూడా హరితమిత్ర అవార్డును అందుకున్నారు. వీరితోపాటు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కూడా సీఎం అవార్డులు అందించారు.
ఉత్తమ సేవలందించిన వారికి సీఎం కేసీఆర్ అవార్డులు




