హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ కల సాకారం అయినప్పటికీ వెనుక బడిన వర్గాలకు సరైన గుర్తింపు రాలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగరానికి రెండవ రాజధాని హోదా వస్తే అసమానతలు దూరం అవుతాయని, సత్వర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలి’…




