విశాఖ : ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రాగల 26 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. దీనికితోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.




