Wednesday, 4 November 2026

ఉపాధి కల్పించాలి

ఏలూరు,జూన్‌27(జ‌నం సాక్షి): వ్యవసాయ కార్మికులకు ఉపాధి హావిూ పనులు కల్పించాలని ఎపి వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులను కల్పించాలని ఆ పథకం కమిషనర్‌ చెబుతున్నా క్రింది స్థాయిలో సరిగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఉపాధి హావిూ నిధులను పక్కదారి పట్టించటంతో ఇందులో అవకతవకలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. ఇప్పటికైనా సక్రమంగా ఉపాధి హావిూ పనులు కల్పించి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు.