Wednesday, 4 November 2026

ఉపాధి పనులకు వెళ్లి ఒకరి మృతి

పత్తికొండ, కర్నూలు : ఉపాధిపనుల కోసం వూరి చెరువులో మట్టి తోలేందుకు వెళ్లి హుస్సేస్‌ బీ (60) అనే మహిళ మృతి చెందగా హసీనా, అనీఫా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చెరువులో మట్టి పని చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబాన్ని నాయకులు ప్రమోద కుమార్‌రెడ్డి , రామచంద్రయ్యలు పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *