ఉపాధ్యాయుల ధర్నా భగ్నం

తిరుపతి,జూలై10(జ‌నం సాక్షి ): ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేశారు. ధర్నాకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలల వద్దకు వెళ్లి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరికి నోటీసులు జారీచేశారు. అధికారులు కాని, పోలీసులు కాని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని, ధర్నా చేయకూడదని నోటీసులు జారీ చేశారు.