
– ఎవరు ఏం తింటున్నారని తొంగిచూడడం మానండి
– తిండి లేనివారి పొయ్యి చూడండి
– అసహనంపై సర్కారును నిలదీసిన ఎంపీ సలీం
– క్షమాపణకు రాజ్‌నాథ్ డిమాండ్
న్యూఢిల్లీ నవంబర్ 30 (జనంసాక్షి):
ఉరి తీస్తారా.. తీయండి : సలీం
న్యూఢిల్లీ : లోక్‌సభలో అసహనంపై చర్చ జరుగుతున్న సమయంలో సీపీఎం నేత మహమ్మద్ సలీం, కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను ఔట్‌లుక్ పత్రికల్లో ప్రచురితమైన వ్యాఖ్యలనే ప్రస్తావించాను అని సలీం తెలిపారు. తాను సభలో ప్రస్తావించింది తప్పని భావిస్తే ఉరి తీస్తారా.. తీయండి, ఏ శిక్ష వేస్తారో వేయండి అని అన్నారు. తాను చేస్తున్న ఆరోపణలు పత్రికల్లో ప్రచురితమైనవే అని సలీం ఉద్ఘాటించారు. విమర్శించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు కారు. విూరు చెప్పేది ప్రపంచం వింటున్నప్పుడు.. ప్రపంచం చెప్పేది విూరు వినండి. ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు.. ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా స్వీకరించండి. ఇది నియంతృత్వ పాలనలోని దేశం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ ఆహారం తింటారన్నది అది వారి వారి వ్యక్తిగతమని సలీం పేర్కొన్నారు. ఇక రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. సలీం తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సలీం క్షమాపణలు చెప్పాల్సిందే. తాను ఎప్పుడూ ఇంతగా బాధపడలేదని భావోద్వేగానికి లోనయ్యారు.
భారతదేశం సహనానికి మారు పేరని, దేశంలో జరుగుతున్న అసహన ఘటనలు చిన్న విషయాలేవిూ కావన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి…పోతుంటాయి… నిరంతరం మారే ప్రభుత్వాలు ప్రామాణికం కాదన్నారు. ఎవరి తిండి వారి ఇష్టమని, ఎవరి ఇంట్లో ఏం వండుకుంటున్నారో చూడకుండా అన్ని ఇళ్లల్లో పొయ్యి వెలిగిందో లేదో చూడాలని సలీం హితవు పలికారు. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై విపక్షాల డిమాండ్ మేరకు లోక్‌సభలో ప్రభుత్వం చర్చకు అనుమతించింది. ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. అసహనం అంశంపై లోక్‌సభలో చర్చ మొదలైన కాసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. 193వ రూల్ కింద సిపిఎం చర్చను ప్రారంభించింది.
అసహన ఘటనలు చిన్న విషయాలేవిూ కావు…
మనసులోని మాటను వినడం లేదు ఎందుకు?….
దేశంలో మనసులోని మాటను వినడం లేదన్నారు. మనం చెప్పేది ఎదుటివారు వింటున్నపుడు వారు చెప్పేది కూడా మనం వినాలన్నారు. ఔట్ గోయింగ్ కాదు ఇన్‌కమింగ్ కూడా స్వీకరించాలని సలీం చెప్పారు.
హేతుబద్దంగా, బహుళత్వం ప్రాతిపదికగా సాగాలన్నారు…….
దేశం హేతుబద్దంగా ఉండాలని, బహుళత్వం ప్రాతిపదికగా సాగాలన్నారు. అసహనంపై ప్రధాని మోది ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
నరేంద్రమోది ప్రధానమంత్రి అయితే దేశంలో 8 వందల ఏళ్ల తర్వాత హిందూరాజ్యం ఏర్పడనుందని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారంటూ సలీం చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి.
సలీం చేసిన వ్యాఖ్యలను ఖండించిన ¬ంమంత్రి….
సిపిఎం సభ్యులు సలీం చేసిన వ్యాఖ్యలను ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. తానెప్పుడు ఈ వ్యాఖ్యలు చేశానో సలీం నిరూపించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని ¬ంమంత్రి డిమాండ్ చేశారు.
ఆరోపణలు చేయడం తగదని స్పీకర్ సూచన….
ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆరోపణలు చేయడం తగదని స్పీకర్ సుమిత్రా మహాజన్ సలీంకు సూచించారు. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో హిందూపాలన వచ్చిందని ఎన్నికల తర్వాత జరిగిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ అన్నట్లు సలీం తెలిపారు. ఓ మ్యాగజిన్‌లో వచ్చిన కథనాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని సలీం స్పీకర్‌కు స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌సింగ్ దాన్ని ఖండించాలంటే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపాలని సూచించారు.
అసహనం ఉందని ఎవరూ అనడం లేదు…
దేశంలో అసహనం ఉందని ఎవరూ అనడం లేదని, ఈ తరహా ఆరోపణలను కావాలనే కొంతమంది పుట్టిస్తున్నారని ¬ంమంత్రి అన్నారు. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన పార్లమెంటరీ జీవితంలో ఎప్పుడూ ఇంత హర్ట్ కాలేదన్నారు.




