చాదర్‌ఘాట్: ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ఉల్లి ధరలు రోజురోజుకూ మారిపోతున్నాయి. మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్‌లో శుక్రవారం జరిగిన వేలం పాటల్లో మొదటిరకం ఉల్లి ధర కిలో రూ.60 పలికింది. రెండో రకం ఉల్లి రూ.50 పలకగా ఇదే ఉల్లి రిటైల్ మార్కెట్‌లో రూ.70 పలుకుతుంది. మొదటి రకం ఉల్లి పూర్తిగా ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కావడంతో ప్రస్తుతం ఈ ఉల్లి మార్కెట్‌లో అందుబాటులో లేదు. ఇదే అదనుగా వ్యాపారులు రెండో రకం ఉల్లిని రూ.70కి కిలో అమ్ముతున్నారు. మలక్‌పేట మార్కెట్‌కు శుక్రవారం 12 వేల క్వింటాళ్ల ఉల్లి రాగా…. ఇందులో మొదటి రకం ఉల్లి మహారాష్ట్ర నుంచి మూడు వందల క్వింటాళ్లు, కర్ణాటక నుంచి రెండో రకం ఉల్లి 3 వేల క్వింటాళ్లు, కర్నూలు నుంచి రెండో రకం ఉల్లి 8 వేల క్వింటాళ్లకు పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గుడ్డి మల్కాపూర్ మార్కెట్ పార్కింగ్ టెండర్లు శుక్రవారం మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అత్యధికంగా టెండర్‌లో రూ.7.14 లక్షలను నెలవారి అద్దెగా చెల్లించేందుకు గోకుల్‌సింగ్ నమోదు చేసినట్లు తెలిపారు. గత ఏడాది రూ.3.18 లక్షలను నెలవారిగా అద్దెను వసూలు చేశారని ఆయన తెలిపారు.
‘ఉల్లి’ ధర కిలో రూ.60




