ఊడిన బస్సు చక్రాలు: తప్పిన ముప్పు

అనంతపురం,,జూన్‌30(జ‌నం సాక్షి): రాయదుర్గం డిపో నుంచి కణెళికల్లుకు వస్తున్న ఆర్టీసీ బస్సు టైర్లు రన్నింగ్‌లో ఊడిపోగా అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాయదుర్గం నుంచి ఉదయం 7.30 గంటలకు ఏపీ 02 జెడ్‌ 0166 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు పది మంది ప్రయాణికులతో కణెళికల్లుకు బయలుదేరింది. కణెళికల్లు పట్టణ పరిసరాల్లో రాంనగర్‌ దాటి టౌన్‌లోకి ప్రవేశిస్తున్న ఆర్టీసీ బస్సుకు చెందిన ఎ డమ వైపు రెండు చక్రాలు ఉన్నట్లుండి ఊడిపోయి చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో బస్సు లో ఒక్కసారిగా కుదుపునకు గురై అక్కడే ని ల్చుండి పోయింది. కానీ బస్సులో ఉన్న పది మంది ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.