Monday, 2 November 2026

డీఎస్ వ్యాఖ్యలు..రగిలిపోతున్న నేతలు..

zvi7kim4హైదరాబాద్ : నిన్నటి దాకా పదవులు అనుభవించారు. ఇక ఆస్తుల సంపాదనపై దృష్టిపెట్టారు. కేవలం ఆస్తుల కోసమే గులాబీ గూటికి చేరారు. డీఎస్‌పై తాజాగా టీకాంగ్రెస్ చేస్తున్న కామెంట్లు ఇవి. ఇప్పటికే పార్టీ మారినందుకు గుర్రుగా ఉన్న నేతలు….తాజాగా కాంగ్రెస్‌పై డీఎస్‌ ఆరోపణలు చేయటంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో చేసిన డీఎస్‌ తప్పులను, అవినీతి-అక్రమాలను వేలెత్తి చూపిస్తున్నారు. డీఎస్‌….టీఆర్‌ఎస్‌లో చేరినందుకు… ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు రగిలిపోతున్నారు. అన్ని పదవులు అనుభవించి…ఇపుడు పార్టీని ఒంటరి చేసి వెళ్తారా…అంటూ మండిపడుతున్నారు. ఐతే తాజాగా కాంగ్రెస్‌పై డీఎస్‌ చేసిన కామెంట్లతో….హస్తం నేతలు మరింత ఉడికిపోతున్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ….ఆయన కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ తనకేమీ ఇవ్వలేదని డీఎస్‌ అన్నారు. తానే కాంగ్రెస్‌కు ఎంతో చేసినట్లు చెప్పుకొచ్చారు. నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతల చరిత్రంతా బటయపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై హస్తం నేతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని ఎంపీ వీహెచ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ఏమీ సంపాదించుకోలేదంటూ…. ఇప్పుడు సంపాదించుకోవటానికే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లావా…అంటూ నిప్పులు చెరిగారు.డీఎస్‌ తీరుపై ఆయన సొంత జిల్లానేతలే మండిపడుతున్నారు. డి.శ్రీనివాస్‌కు రాజకీయ జీవితాన్నిచ్చింది…కాంగ్రెస్సేనని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఎనిమిది సార్లు టికెటిస్తే….కేవలం మూడు సార్లే గెలిచారని ఎద్దేవా చేశారు. ఆయన పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా, ఆయన కుమారుడు మేయర్‌గా చేసినా….నిజామాబాద్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు…బీఫామ్‌లకు వసూలు చేసిన డబ్బు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత డీఎస్‌ పార్టీ మారినపుడు కాంగ్రెస్‌ నెమ్మదిగా స్పందించింది. కాని ఇపుడు డీఎస్‌…ఏకంగా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేయటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ మాత్రం ఊరుకునేది లేదని…ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *