పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని భయం
హైదరాబాద్,ఏప్రిల్7(జనంసాక్షి): పరీక్షలు ముగిసినా స్కూళ్లు నడుస్తుండడంతో మండుతున్న ఎండలకు విద్యార్థులు అల్లాడుతున్నారు. వెంటనే సెలవుఉల ప్రకటిస్తారని ఎదురు చూసిన పిల్లలకు ఈ ఎండాకాం పరీక్ష పెడుతోంది. దీనికితోడు మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. కేవలం ప్రైవేట్ పాఠశాలలను పెంచి పోషించడానికే ఈ స్కూళ్లు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తక్షణంసెలవులు ప్రకటిస్తే విద్యార్థులు ఎండదెబ్బలకు దూరంగా ఉంటారని తల్లిదండ్రలు, విద్యార్తి,ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం కాపాడిన వారం అవుతామని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. అనవసరంగా పిల్లలను స్కూళ్లకు పంపించాలన్న నిబంధన వల్ల వారికి ఎండలో ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. తెలుగు రాష్టాల్ల్రో అసాధారణ ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బ బారిన పడి ఆస్పత్రిలో చేరాల్సిన దుస్థితి ఉందన్నారు. దీంతో పాఠశాలలకు సెలవులు ఇస్తే మంచిదని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు కావాలంటే జూన్లో కాస్త ముందుగానే బడులు తెరవచ్చని పలువురు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు. మార్చినుంచే ఎండలు తీవ్రంగా ఉన్నందున తెలుగు రాష్టాల్లో వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ దశలో చిన్నారుల విషయం ఆలోచన చేయాల్సిఉందన్నారు. ఒంటిపూట బడులకు వెల్లొచ్చే పిల్లలు కొంతమంది వడదెబ్బకు గురవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేశారు. తెలంగాణలో సరికొత్త విద్యావిధానం పుణ్యమా అని పరీక్షలు పూర్తి అయిపోయాయి. సీబీఎస్సీ విధానాన్ని ఈ ఏడాది ప్రారంభించిన నేపథ్యంలో తర్వాతి క్లాసులను చెబుతున్నారు. దీనికి తోడు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, తాగేందుకు మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో మండుటెండలో పిల్లలు తిరిగివస్తున్నారని, వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలు అవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు మార్చి 16 నాటికే ముగిశాయి. ఒంటిపూట బడులను రద్దు చేసి మార్చి 21 నుంచే నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. కానీ ఏప్రిల్ 23వరకు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రూపొందించలేదు. దీనికి తోడు విపరీతమైన ఎండల కారణంగా చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. రాకుంటే ఏమవుతుందో అని వచ్చేవారు ఎండదెబ్బకు తాళలేకపోతున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఎండల్లో స్కూళ్లపై తల్లిదండ్రుల ఆందోళన




