ఎంపిల రాజీనామాల ఆమోదం కీలకఘట్టం
ఎంపిల త్యాగాన్ని ప్రజలు మరచిపోరు: కన్నబాబు
కాకినాడ,జూన్22(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ¬దాకోసం పోరులో వైకాపా చేస్తున్న ప్రయత్నంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. ఎంపీల త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. పదవుల కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ¬దా విషయంలో ప్రజాకోర్టు బోనులో నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రత్యేక ¬దా అంశంగా ఉపఎన్నికలకు చంద్రబాబు సిద్ధం కావాలన్నారు. ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దమవ్వాలని సవాల్ విసిరారు. ¬దా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల త్యాగం అభినందనీయమని మరోనేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలంటే చంద్రబాబు బయపడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో ¬దా కోసం చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.