Tuesday, 3 November 2026

ఎంపీ లాండ్స్‌ నిధులు పెంచండి కేంద్రానికి తెరాసా ఎంపీల లేఖ

5
హైదరాబాద్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎంపీ లాండ్స్‌ నిధులు పెంచాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా కల్పించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి పేరు మార్చడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యథావిధిగా కొనసాగించాలని కోరారు. శనివారం టీఆర్‌ఎస్‌ భవన్లో ఎంపీలు బాల్క సుమన్‌, బూర నర్సయ్యగౌడ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు విూడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసం ప్రస్తుతం ఇస్తున్న ఎంపీ ల్యాడ్స్‌ రూ.5 కోట్లు ఎందుకు సరిపోవడం లేదని బాల్క సుమన్‌ తెలిపారు. ఎంపీల్యాడ్స్‌ పెంచితే బాగుంటుందని దేశవ్యాప్తంగా ఎంపీలంతా కోరుతున్నారని చెప్పారు. దీనిపై ఇటీవల రెండు సమావేశాల్లోనూ చర్చ జరిగిందని, అలాగే, పలువురు కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసిన సమయంలో ఎంపీల్యాడ్స్‌ పెంపుపై చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.5 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ను రూ.8 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా కలిసి లేఖ రాశామన్నారు. అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్‌ పెంచాలని కోరుతున్నామని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంపీల్యాడ్స్‌ను పెంచాల్సిన అవసరముందన్నారు. ఇదే అంశంపై సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇది కేవలం టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సంబంధించి అంశం కాదని.. ప్రధాని తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. అలాగే, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకొనే గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరతామన్నారు.

తెలంగాణ సమస్యలు వినిపిస్తాం

తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రధాని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ప్రత్యేక ¬దా కల్పించాలని కోరతామని చెప్పారు. అలాగే, చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని పట్టుబడతామన్నారు. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణలో తక్షణమే 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరతామని, రైల్వే ప్రాజెక్టుల అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ కేటాయించాలని ఒత్తిడి తెస్తామన్నారు. పొరుగు రాష్ట్రం విభజన చట్టాలను ఉల్లంఘిస్తూ విద్యుత్‌ వాటా ఇవ్వడం లేదని, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, అలాగే, అదనపు విద్యుత్‌ కేటాయించాలని కోరతామని చెప్పారు.

సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్టాన్రికి సమస్యలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ సర్కారు పని చేయకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆర్నెల్లు అయ్యింది.. రోజుకో కొత్త అంశంతో సీమాంధ్ర నాయకత్వం, ప్రభుత్వం, కేంద్రం సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణను శాంతియుతంగా ఉండనీయకుండా, ప్రభుత్వాన్ని పనిచేసుకోకుండా అడ్డంకులు వేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ఎయిర్‌పోర్టుకు ఎవరి పేరు పెట్టుకోవాలన్నది తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఇష్టమన్న విషయాన్ని కేంద్రం, పక్క రాష్ట్ర నేతలు గుర్తించాలని సూచించారు. శంషాబాద్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే బాగుండేదన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి టీడీపీకి చెందిన వ్యక్తి కావడం వల్ల రాష్టాన్న్రి సంప్రదించకుండానే పేరు మార్పుపై జీవో జారీ చేశారని తెలిపారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇంకా ఆంధ్ర ప్రాంత నేతల్లాగా వ్యవహరించొద్దని సూచించారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ధర్నాలకు పాల్పడడం విచారకరమని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర నాయకత్వం అడుగులకు మడుగులొత్తడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ శాసనసభ తీర్మానంపై సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలు సరికాదని నర్సయ్య గౌడ్‌ అన్నారు. విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెడితే విూరు అంగీకరిస్తారా? అని వారిని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్టాన్న్రి ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినందున కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందన్న అభిప్రాయం ఉందన్నారు. ఎయిర్‌పోర్టు పేరు మార్పుపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. ప్రత్యుష్‌ సిన్హా కమిటీ, కమల్‌నాథన్‌ కమిటీ, ఉమ్మడి సంస్థలు-ఉమ్మడి నిధులపై పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఉద్యోగుల విభజనలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్టాల్రు విడిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణపై  పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *