Tuesday, 3 November 2026

వామ్మో ! ఆశ్రమం కాదది.. ఆయుధ గిడ్డంగి

6

ఛండీఘర్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : బాబా రాంపాల్‌ది ఆశ్రమం కాదు.. అది  ఓ ఆయుధ గిడ్డంగిని తలపిస్తోంది. వివాదాస్పద బాబా రాంపాల్‌ ఆశ్రమంలో సోదాలు చేసిన హర్యానా పోలీసులు అక్కడి వస్తువులు చూసి షాక్‌ తిన్నారు. రాంపాల్‌కు చెందిన సత్‌లోక్‌ ఆశ్రమంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, చిల్లీ గ్రెనేడ్‌, యాసిడ్‌ సిరంజీలు, ప్రెగ్నెన్సీ పరీక్షా స్టిప్స్ర్‌ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. పైగా.. ఈ ఆశ్రమంలోని సౌకర్యాలు నక్షత్ర ¬టల్‌ను తలపిస్తున్నట్టు పోలీసులు జరిపిన తాజా తనిఖీల్లో బయపడింది. ముఖ్యంగా ఆశ్రమం పేరుతో రాంపాల్‌ అనుచరులు భారీ ఎత్తునే ఆయుధాలను సమకూర్చుకున్నారు. మారణాయుధాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 12 బోర్‌ రైఫిల్స్‌-23… 315 బోర్‌ రైఫిల్స్‌-10, ఒక పిస్టల్‌ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. వీటితో పాటు వందల సంఖ్యలో బాటిల్‌ బాంబులు, యాసిడ్‌ డబ్బాలు దొరికాయి. అంతే కాదు అత్యంత విలాసవంతమైన భవనాలు, స్విమ్మింగ్‌ పూల్‌, మూవీ థియేటర్లు ఆశ్రమంలో ఉన్నాయి. . రెండు సీక్రెట్‌ గదుల్లోని బ్యాగులు, బీరువాల్లో ఈ ఆయుధాలను పేర్చారని, పైగా కొన్నింటిని బాబా కూర్చునే ఎత్తయిన కట్టడం కింద దాచారని.. హర్యానా పోలీసు విభాగంలోని ‘ సిట్‌ ‘ అధికారులు తెలిపారు. ఈ ఆశ్రమంలోని ఓ గది పక్కనున్న బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిఉన్న ఓ మహిళను తాము గుర్తించి ఆసుపత్రికి తరలించామన్నారు.మధ్యప్రదేశ్‌కు చెందిన బిజిలేశ్‌ అనే మహిళగా ఆమెను గుర్తించినట్టు తెలిపారు. అటు-  ‘ఈ ఆశ్రమం లగ్జరీ ¬టల్‌ను తలపించే విధంగా ఉంది. అధునాతన స్విమ్మింగ్‌ఫూల్‌, 24 ఏసీ రూమ్‌లు ఉన్నాయి.. ఓ గదిలో మ్యాసేజ్‌ బెడ్‌, త్రెడ్‌మిల్‌ గమనించాం.. ప్రతి గదిలోనూ భక్తులు, శిష్యుల కదలికలను గమనించే సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. ఒకచోట.. నిమిషంలో వెయ్యి రొట్టెలు తయారుచేసే ఎలక్టాన్రిక్‌ రోటీమేకింగ్‌ మెషిన్‌ కూడా ఉంది. కాగా  ఆశ్రమం మొత్తాన్ని ఖాళీ చేయించామని, ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ ఆధీనంలో ఆశ్రమం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బాబా రాంపాల్‌ను హిస్సార్‌ సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు తెలిసింది.

28 వరకు జైల్లోనే

పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాబా రాంపాల్‌  పంజాబ్‌, హర్యానా హైకోర్టులో ఓ వింత వాదనను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనే అనుకున్నా, తన సొంత కమెండోలు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని ఆయన చెప్పారు.దీంతో న్యాయమూర్తి రాంపాల్‌ కొత్త వాదనపై విస్మయం వ్యక్తం చేశారు. ‘విూ వాదన నమ్మశక్యంగా లేదే!’ అంటూ రాంపాల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. అంతేకాక సదరు వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కేసులో తదుపరి విచారణను కొనసాగించారు.  నిందితుడికి 5 రోజులపాటు కస్టడీ విధించారు. హైకోర్టు ఈనెల 28 వరకు జుడిషియల్‌ కస్టడీకి రిమాండ్‌ చేసింది. అంతకుముందు ఈయన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. పంచకులలో బాబాకు వైద్య పరీక్షలు జరిగాక, పోలీసులు తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. కాగా తాను అమాయకుడినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని రాంపాల్‌ అన్నారు. తలో తన ఆశ్రమంలోకి ప్రవేశించబోయిన గ్రావిూణులపై కాల్పులు జరపవలసిందిగా తన అనుచరులను రాంపాల్‌ ఆదేశించగా వారి కాల్పుల్లో ఒకరు మరణించారు. చాలామంది గాయపడ్డారు. ఆ కేసులో కోర్టుకు హాజరు కావలసిందిగా కోర్టునుంచి సమన్లు జారీ అయినప్పటికీ మొత్తం 42సార్లు గైర్‌ హాజరయ్యారు. దాంతో కోర్టు ధిక్కార కేసు కూడా ఈ బాబాపై నమోదయింది.పాలతో అభిషేకం, ఆ పాలతో కీర్‌, భక్తులకు ప్రసాదంవివాదాస్పద బాబా రాంపాల్‌పై జాతీయ విూడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.  రాంపాల్‌ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే త్రిమూర్తులను తిరస్కరించి, కబీర్‌ను మాత్రమే దేవుడిగా భావించాలని చెప్పేవారు. ఆ కథనాల ప్రకారం – రాంపాల్‌ పాలతో స్నానం చేసేవాడని, ఆ పాలతో ఖీర్‌ తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసేవారని అంటున్నారు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌లో ఉన్న సత్‌లోక్‌ ఆశ్రమాధిపతి రాంపాల్‌ బాబా వివాదాస్పద స్వామిగా పేరుబడిన విషయం తెల్సిందే. తన అనుచరగణంతో కలిసి ఆశ్రమంలో చేసిన లీలలు ఆయన అరెస్టుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తొలుత నీటితో స్నానం చేయరట.. పాలతో స్నానం (అభిషేకం) చేసి.. ఆ పాలతో పాయసం చేసి అది భక్తులకు ప్రసాదంగా పంచుతారట. రాంపాల్‌ బాబాను అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా మృత్యువాతపడింది. ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న రాంపాల్‌ బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన దర్జా వెలగబెట్టిన విధానం, ప్రజలను భక్తి ముసుగులో వంచించిన వైనం అన్నీ బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అనుచరులు బాబాకు పాలతో స్నానం (అభిషేకం) చేయిస్తారట…. ఆ పాలతో పాయసం చేసి ప్రసాదంలా అందరికీ పంచిపెడతారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *