Tuesday, 3 November 2026

దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి కేంద్రానికి దీదీ సవాల్‌

4

కోల్‌కతా, నవంబర్‌ 22 (జనంసాక్షి) : దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సవాల్‌ విసిరింది. కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమని తెలిపారు. దమ్ముంటే పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సవాల్‌ విసిరారు. శనివారం మమత కోల్‌కతాలో సమావేశమైన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్‌ పార్టీ అణిగి ఉంటుందేమో.. అందుకే వారు తమ వాణిని వినిపించడం లేదని ఎద్దేవా చేశారు. కానీ తాను మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. ‘మాపై దాడి చేస్తే..మేం ఎదురుదాడి చేస్తాం.. మేం కన్నెర్రజేసేలా యత్నించొద్దు. మేమేవిూ విూ విూద ఆధారపడి లేమని’ బీజేపీని ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు. పరిపాలన చేయడం దేశాన్ని ప్రేమించినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. ఆరు నెలలుగా దేశంలో ప్రతిచోటా ఘర్షణలు జరగుతున్నాయని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థపైనా మమత విరుచుకుపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను సుప్రీంకోర్టే తప్పుబట్టిందని గుర్తుచేశారు. సీబీఐ స్థానంలో మరో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టే సీబీఐ విశ్వసనీయతను ప్రశ్నించిన తర్వాత ఆ సంస్థ ఇంకా కొనసాగడం నైతికమా? దాని స్థానంలో విశ్వసనీయతతో కూడిన మరో వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని’ వ్యాఖ్యానించారు. శారద కుంభకోణంలో తృణమూల్‌ ఎంపీ శృంజయ్‌ రాయ్‌ను అరెస్టు చేయడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకొని లౌకికవాదంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరు కావడం వల్లే బోస్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇలాంటి సదస్సులకు తాను వేల సార్లు హాజరవుతానని స్పష్టం చేశారు. బోస్‌ అరెస్టు వెనుక కుట్ర దాగి ఉందని తెలిపారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉండడంతో కావాలనే ప్రతిపక్ష బలాన్ని తగ్గించుకోవాలని కేంద్రం తమ రాజ్యసభ సభ్యుడ్ని అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఆ బిల్లులు ఆమోదం పొందకుండా తమ ఎంపీలు కృషి చేస్తారని.. అలాగే, విదేశాల్లో మూలుగుతున్న నిధులను వెనక్కు తెప్పించేలా ఒత్తిడి తెస్తారని చెప్పారు.

సీబీఐపై విరుచుకుపడిన మమత

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వైఖరిని బంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుబట్టారు. సీబీఐ అధికారులపై ఆమె విరుచుకుపడ్డారు. శనివారం ఆమె మాట్లాడుతూ సీబీఐ విశ్వసనీయతను సుప్రీంకోర్టే తప్పుపట్టిందన్నారు. పరిపాలన చేయడం దేశాన్ని ప్రేమించినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. 6 నెలలుగా దేశంలో ప్రతిచోటా ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. తృణమూల్‌ ఎంపీ శ్రీనోయ్‌ బోస్‌ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు ఆరోపణలతో ఒక ఎంపీని ఏవిధంగా అరెష్టు చేస్తారని ఆమె సీబీఐని ప్రశ్నించింది. ఇదిలావుంటే, శారదా గ్రూప్‌ కేసు విచారణలో భాగంగా శనివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ సహాయకుడు సీబీఐ ఎదుట హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *