విజయవాడ, జనంసాక్షి: రాజకీయాల్లో డబ్బు ప్రధానమని.. అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ తరపున ఎంపీ సీటు ఇస్తే తేను డబ్బు ఖర్చు పెడతానని వ్యాఖ్యానించారు. ఎంపీ సీటు తన డిమాండ్ అని….. అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు. పార్టీలోకి కొత్తగా డబ్బు ఖర్చు పెడితే.. ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చు పెడుతున్నటవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. త్వరగా చంద్రబాబును కలిసి ఎంపీ సీటు హామి పొందుతానని తెలిపారు.
గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్ ఈ సారి మాత్రం విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కేశనేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానిని నియమించడంతో ఎంపీ సీటు కోసం పోరు మొదలైంది.
కాగా గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే ఈ మధ్య పర్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి తప్పించిన నానిని నియమించారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన నానిని ఈ పదవి కట్టబెట్టడంపై ఇటు గద్దె రామ్మోహన్‌తో పాటు వంశీవర్గం తీవ్ర అసంతృప్తి ఉంది.




