Tuesday, 3 November 2026

ఎంసెట్‌లో జోక్యం చేసుకోలేం

8 copy
ఆంధ్ర సర్కారుకు తేల్చిచెప్పేసిన వెంకయ్య

న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  తెలుగు రాష్టాల్రలో నెలకొన్న ఎంసెట్‌ వివాదంపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌తో  మాట్లాడతానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇది గవర్నర్‌ సమక్షంలో పరిష్కారం చేసుకుని ఉంటే బాగుండేది. గవర్నర్‌ వ్యవస్థ ఉన్నదే సమస్యల పరిస్కారం కోసమన్నారు.  ఈ అంశంపై అంతకు మించి తన జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టం మేరకు అందరూ నడుచుకోవాల్సిందేనని అన్నారు. దీనికి  రాజకీయ రంగు పులమొద్దని విలేకర్లకు సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహణపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో తీవ్ర సందిగ్థత నెలకొంది.  నేపథ్యంలో ఎంసెట్‌ పంచాయతీ గవర్నర్‌ వద్దకు చేరింది. దాంతో ఇరు రాష్టాల్ర విద్యాశాఖ మంత్రులతో గవర్నర్‌ సమక్షంలో చర్చలు జరిపారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆంధప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంకయ్యనాయుడుపై విధంగా స్పందించారు. దీనికి సమాధానం వెతకాల్సి ఉందని, ఇరు ప్రాంతాలకు నష్టం జరగని విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అతిగా కేంద్రం జోక్యం చేసుకుంటే రాష్టాల్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని విమర్శలు వస్తాయని అన్నారు. అందుకే వారే పరిష్కరించుకుంటే మంచిదన్నారు. దీనికి తనవతంఉ ప్రయత్నం చేస్తానన్నారు. ఎంసెట్‌ నిర్వహణపై నెలకొన్న వివాదంపై అందుకే తాను జోక్యం చేసుకోలేననివెంకయ్యనాయుడు అన్నారు. గవర్నర్‌ వద్దే సమస్యను పరిష్కరించుకొని ఉంటే బాగుండేది. ఈ విషయాన్ని ¬ంమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఇరురాష్టాల్రు కోరినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *