Tuesday, 3 November 2026

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వాములు కండి

6 copy
ప్రవాస్‌ భారతీయ దివాస్‌లో సుష్మా పిలుపు

గాంధీనగర్‌,జనవరి7(జనంసాక్షి) :   దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియాలో ప్రవాస భారతీయుల భాగస్వాములు కావాలనీ అప్పుడే దేశం ప్రగతిపథంలో ముందుకు దూసుకువెళ్తుందనీ అమే అన్నారు. దేశంపట్ల మక్కువతో అభివృద్దిలో పాలుపంచుకోవాలన్నారు. బుధవారం గాంధీనగర్‌లో  ప్రారంభమైన ప్రవాస్‌ భారతీయ దివాస్‌లో  ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సుష్మా… ఎన్నారై యువతతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.దేశంలో ఎన్నారైలు వ్యాపారాలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుష్మా స్వరాజ్‌ వివరించారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో తమ ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలన్నీ పాదర్శకంగా అమలు పరుస్తున్నట్లు తెలిపారు. కమ్‌, కనెక్ట్‌, సెలబ్రెట్‌, కంట్రిబ్యూట్‌ అంటూ ‘నాలుగు సీ’ల ప్రాముఖ్యతను సుష్మా ఈ సందర్భంగా ఎన్నారై యువతకు విశదీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *