Tuesday, 3 November 2026

ఎక్స్ ప్రెస్‌లో సూదిగాడు

6i287tphహైదరాబాద్‌: భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూదిగాడు కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సూది ఉన్మాది రవికుమార్‌ హల్‌ చల్‌ చేశాడు. పలువురు ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు సూది ఉన్మాది రవికుమార్‌ను చితకబాది సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఉన్మాది నుంచి రెండు సిరంజిలు, రెండు సిమ్‌కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్మాది రవికుమార్‌ వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైలు ఎక్కినట్లు ప్రయాణికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *