Tuesday, 3 November 2026

బంజారాహిల్స్‌లో ముగ్గురు బీటెక్ విద్యార్ధులు మృతి

wwqislitహైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే మసీదుకు ఎదురుగా ఉన్న దుకాణం గోడను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉప్పల్‌కు చెందిన శరశ్చంద్ర, తేజ, నరేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో కార్తీక్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబరు టీఎస్ 08 ఈసీ 1702 గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్ధులు మద్యం సేవించి కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *