Tuesday, 3 November 2026

ఎన్టీఆర్‌నగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

stcvsnqiహైదరాబాద్: ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 386 మంది పోలీసులు తనిఖీ జరుగుతోంది. తనిఖీలలో పత్రాలు సరిగా లేని 41 వాహనాలు, 11 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 11 సిలిండర్లు, రెండుగ్యాస్‌రీఫిల్లింగ్ యంత్రాలు, 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *