Wednesday, 4 November 2026

ఎన్టీఆర్‌ తెలుగువారికి ఆదర్శప్రాయుడు

ఏలూరు,మే28( జ‌నం సాక్షి ): తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా చాటిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు ఆదర్శప్రాయుడని ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా దెందులూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు. పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతావస్త్రాలు వంటి వాటిని ఆయన అమలు చేశారన్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయసాధన కోసం చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ సభ్యురాలు సక్కుకుమారి, ఎంపీటీసీ సభ్యులు జహీర్‌, శ్రీను, కిషోర్‌, సర్పంచి అజయ్‌, తదితరులు పాల్గొన్నారు.