
మాస్కో డిసెంబర్ 29(జనంసాక్షి): ప్రమాదకరమైన ఎబోలా వైరస్ నుంచి రక్షించే ఒక టీకాను రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని త్వరలోనే ఆఫ్రికాలో పరీక్షించనున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫత్లిుౖంజాకు చెందిన పరిశోధకులు దీన్ని తయారుచేశారు. తొలుత దీన్ని జంతువులపై పరీక్షించనున్నారు. తర్వాత ఆఫ్రికాలో మానవులపై ప్రయోగించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఒలెగ్ కిసెలెవ్ తెలిపారు. మొత్తం మీద అన్నిదశల పరీక్షలు ఫిబ్రవరిలో పూర్తవుతాయని చెప్పారు.తాము రూపొందించిన ఎబోలా టీకాను ఆఫ్రికా ప్రజలపై ప్రయోగించగా.. ఔషధం సురక్షితమేనని తేలిందని గతవారం అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఏఐడీ) సంస్థ పేర్కొంది. చెయనా పరిశోధకులు కూడా ఓ టీకాను రూపొందించారు. దీన్ని కూడా మానవులపై ప్రయోగించాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ 7,693 మంది మరణించారు.
ఎబోలాకు టీకా మందు కనిపెట్టిన రష్యా శాస్త్రవేత్తలు




